SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SBI PO Recruitment 2026


SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

బ్యాంకింగ్ రంగంలో అత్యున్నత హోదా కలిగిన ఉద్యోగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న SBI శాఖలలో జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-I (JMGS-I) కింద 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఉద్యోగానికి సంబంధించిన ఖాళీలు, జీతం, వయోపరిమితి, ఎంపిక విధానం మరియు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో క్లియర్ గా తెలుసుకుందాం.

💼 పోస్టుల వివరాలు - Vacancy Details

మొత్తం 1500 ఖాళీలను వర్గాల వారీగా (Category-wise) కింద ఇవ్వబడిన పట్టికలో చూడవచ్చు:

Category (వర్గం) Vacancies (ఖాళీలు)
UR General 588
OBC Other Backward Class 390
EWS Economically Weaker Section 144
SC Scheduled Caste 234
ST Scheduled Tribe 144
Total Vacancies (మొత్తం ఖాళీలు) 1500

💵 జీతం వివరాలు - Salary & Benefits

SBI PO గా ఎంపికైన అభ్యర్థులకు దేశంలోనే అత్యుత్తమ శాలరీ ప్యాకేజీ లభిస్తుంది.

  • జీతం స్కేల్: ₹48,480 – 85,920
  • ప్రారంభ బేసిక్ పే: ₹48,480 (దీనితో పాటు 4 అదనపు ఇంక్రిమెంట్లు ముందుగానే లభిస్తాయి)
ఇతర అలవెన్సులు & ప్రయోజనాలు:
  • కరువు భత్యం (DA), ఇంటి అద్దె భత్యం (HRA), నగర పరిహార భత్యం (CCA)
  • ప్రావిడెంట్ ఫండ్ (PF), జాతీయ పింఛను వ్యవస్థ (NPS)
  • వైద్య ప్రయోజనాలు, లీవ్ ఫేర్ కన్సెషన్ (LFC), లీజు అద్దె సౌకర్యం (Lease Rental Facility).
  • ముంబై లాంటి మెట్రో నగరాల్లో వార్షిక CTC సుమారుగా ₹21.97లక్షలు ఉంటుంది.

🎓 విద్యార్హతలు  - Eligibility Criteria

- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (Graduation) పూర్తి చేసి ఉండాలి.

- డిగ్రీ చివరి సంవత్సరం/సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా తాత్కాలికంగా (Provisional) దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఇంటర్వ్యూ సమయానికి వారు పాస్ అయినట్లు ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది.

🕒 వయోపరిమితి వివరాలు - Age Limit

వయో పరిమితి (01 ఏప్రిల్ 2026 నాటికి) :-

  • కనీస వయస్సు: 21 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

(అభ్యర్థులు 02 ఏప్రిల్ 1996 మరియు 01 ఏప్రిల్ 2005 మధ్య జన్మించి ఉండాలి - ఈ రెండు తేదీలతో సహా).

వయోసడలింపు (Age Relaxation):

ఎస్సీ/ఎస్టీ (SC/ST): 5 సంవత్సరాలు

  • OBC (నాన్-క్రీమీ లేయర్): 3 సంవత్సరాలు
  • PwBD (జనరల్/EWS): 10 సంవత్సరాలు
  • PwBD (OBC): 13 సంవత్సరాలు
  • PwBD (SC/ST): 15 సంవత్సరాలు

🎯 ఎంపిక విధానం - Selection Process

SBI PO ఎంపిక విధానం అత్యంత పారదర్శకంగా మూడు దశల్లో నిర్వహించబడుతుంది:

దశ-I: ప్రాథమిక పరీక్ష (Preliminary Exam)

ఇది 100 మార్కులకు ఆన్‌లైన్ లో జరుగుతుంది. దీనిలో ఎటువంటి సెక్షనల్ కటాఫ్ లేదు.

విషయం (Subject) ప్రశ్నలు మార్కులు వ్యవధి
📖 ఆంగ్ల భాష (English) 40 40 20 నిమిషాలు
🔢 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30 30 20 నిమిషాలు
🧠 రీజనింగ్ ఎబిలిటీ 30 30 20 నిమిషాలు
మొత్తం (Total) 100 100 60 నిమిషాలు


దశ-II: ప్రధాన పరీక్ష (Mains Exam)

మెయిన్స్ పరీక్షలో ఆబ్జెక్టివ్ (200 మార్కులు) మరియు డిస్క్రిప్టివ్ (30 మార్కులు) పరీక్షలు ఉంటాయి. మొత్తం సమయం 3 గంటల 30 నిమిషాలు.

విషయం (Subject) ప్రశ్నలు మార్కులు
🧠 రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 40 60
📊 డేటా విశ్లేషణ & వివరణ (DI) 30 60
💰 జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ 60 60
📖 ఆంగ్ల భాష (English Language) 40 20
మొత్తం (Total Objective) 170 200

వివరణాత్మక పరీక్ష:

  • ఇమెయిల్ రాయడం
  • పరిస్థితి విశ్లేషణ
  • నివేదిక రచన / సంగ్రహ రచన

దశ-III: సైకోమెట్రిక్ & ఫేస్-3 టెస్ట్

మెయిన్స్ లో క్వాలిఫై అయిన వారికి కింద పేర్కొన్న పరీక్షలు ఉంటాయి:

  • సైకోమెట్రిక్ పరీక్ష (Psychometric Test)
  • సమూహ వ్యాయామం (Group Exercise): 20 మార్కులు
  • వ్యక్తిగత ఇంటర్వ్యూ (Interview): 30 మార్కులుarun 

ప్రధాన పరీక్ష మరియు ఇంటర్వ్యూ స్కోర్‌ల ఆధారంగా తుది మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది.


💳 దరఖాస్తు రుసుము & సర్వీస్ బాండ్ - Application Fee & Bond

జనరల్ / EWS / OBC అభ్యర్థులకు: ₹750

SC / ST / PwBD అభ్యర్థులకు: ఎటువంటి ఫీజు లేదు (Nil)

Note : దరఖాస్తు రుసుము వాపసు ఇవ్వబడదు.

సర్వీస్ బాండ్: ఎంపికైన అభ్యర్థులు జాయిన్ అయ్యే సమయంలో ₹2,00,000 సర్వీస్ బాండ్‌పై సంతకం చేయాలి. బ్యాంక్‌లో కనీసం 3 సంవత్సరాలు తప్పనిసరిగా సేవలు అందించాల్సి ఉంటుంది.

📅 ముఖ్యమైన తేదీలు  - Important Dates

ఈవెంట్ (Event Details) తేదీ (Important Dates)
నోటిఫికేషన్ & ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం
Notification & Application Start
18 జూన్ 2026
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ
Last Date to Apply Online
08 జూలై 2026
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ
Last Date for Fee Payment
08 జూలై 2026
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ
SBI PO Prelims Exam Date
త్వరలోనే ప్రకటిస్తారు
మెయిన్స్ పరీక్ష తేదీ
SBI PO Mains Exam Date
త్వరలోనే ప్రకటిస్తారు

💻 ఆన్‌లైన్ దరఖాస్తు విధానం  - Step-by-Step Process

SBI PO ఆన్‌లైన్ దరఖాస్తు విధానం (Simple Steps)

Step 1: మొదట https://bank.sbi/careers వెబ్‌సైట్‌కి వెళ్లి, "RECRUITMENT OF PROBATIONARY OFFICERS" నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయండి.

Step 2: "Click here for New Registration" పై క్లిక్ చేసి.. మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి.

Step 3: మీ ఫోన్‌కు వచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.

Step 4: అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత మరియు విద్యా అర్హతల వివరాలను పూరించండి.

Step 5: మీ ఫోటో, సంతకం, ఎడమచేతి బొటనవేలు ముద్ర, మరియు డిక్లరేషన్‌లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.

Step 6: మీ కేటగిరీని బట్టి నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించండి.

Step 7: చివరగా అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి, కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ లేదా PDF రూపంలో సేవ్ చేసుకోండి.

🔗 ముఖ్యమైన లింకులు (Important Links)

గమనిక: పైన ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ PDFని పూర్తిగా చదివిన తర్వాతే దరఖాస్తు చేసుకోగలరు.

0 Comments