రైతులకు బిగ్ అలర్ట్: మీ అకౌంట్‌లో PM Kisan, అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయో లేదో ఇప్పుడే చూసుకోండి!
Annadata Sukhibhava - PM Kisan 2026:
రైతు సోదరులకు ఒకేసారి డబుల్ ధమాకా అందుతోంది. ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "అన్నదాత సుఖీభవ – PM కిసాన్" సంయుక్త పథకం యొక్క మొదటి విడత నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తున్నారు.
ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 20,000 ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది (ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 14,000 కాగా, కేంద్ర ప్రభుత్వం PM-KISAN కింద అందించే రూ. 6,000 కలిపి ఉంటాయి). ఈ ఏడాది మొదటి విడత కింద మొత్తం రూ. 7,000 రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి.
మొత్తం సమాచారం, అర్హుల వివరాలు మరియు మీ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో క్రింది కథనంలో పూర్తి వివరంగా తెలుసుకోండి.
💰 మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయో లేదో కింద ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి వెంటనే చూసుకోండి!
📍 నిధుల విడుదల వేదిక & వివరాలు :-
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని లింగంగుంట్లా గ్రామంలో జరిగే రాష్ట్ర స్థాయి బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ (DBT) చేయనున్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘PM-KISAN ఉత్సవ్ దివస్’ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తుండగా, దానికి అనుసంధానంగా ఏపీ ప్రభుత్వం కూడా తన వాటాను కలిపి విడుదల చేస్తోంది.
📲 PM-KISAN & అన్నదాత సుఖీభవ స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేయడం ఎలా?
మీ ఖాతాలోకి రూ. 7,000 జమ అయ్యాయా లేదా, మీ అప్లికేషన్ ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడానికి క్రింది పద్ధతులను అనుసరించండి.
1. అన్నదాత సుఖీభవ స్టేటస్ చెకింగ్ విధానం:
🌾 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెకింగ్ విధానం
2. PM-KISAN స్టేటస్ చెకింగ్ విధానం:
🌾 PM-KISAN స్టేటస్ చెకింగ్ విధానం
- మీ ఖాతాలో నిధులు సరిగ్గా జమ కావాలంటే, మీ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ సీడింగ్ (Aadhaar Seeding) మరియు e-KYC తప్పనిసరిగా పూర్తయి ఉండాలి.
- ఒకవేళ మీ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు ఏదైనా సమస్య లేదా తప్పులు కనిపిస్తే, వెంటనే మీ పరిధిలోని రైతు సేవా కేంద్రం (RSK) లేదా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించండి.
- ఈ పథకం కింద నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు సేవా కేంద్రాల్లో (RSK) మధ్యాహ్నం 3:45 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారం (Live Stream) చేయనున్నారు.

Post a Comment