ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు - రాత పరీక్ష లేకుండానే జాబ్! - అప్లై ప్రాసెస్ ఇదే!
APMSRB Recruitment 2026 :
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. జాతీయ ఆరోగ్య మిషన్(NHM) కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన 529 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు(APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో స్టాఫ్ నర్సుల పోస్టులు 419, ఫార్మాసిస్టు 24, మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ల పోస్టులు 86 ఉన్నాయి. తగిన అర్హతలు కలిగినవారు జూన్ 30లోగా అప్లై చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో 529 పోస్టులకు ఈనెల 13 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద ఒప్పంద విధానంలో స్టాఫ్ నర్సుల పోస్టులు జోన్ల వారీగా, ఇతర పోస్టులు జిల్లాల స్థాయిలో భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగినవారు జూన్ 30లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
APMSRB Recruitment 2026 - (Notification Overview)
| ఫీచర్ / వివరాలు (Particulars) | అధికారిక సమాచారం (Official Details) |
|---|---|
| సంస్థ పేరు (Organization) | ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB) |
| ఉద్యోగ రకం (Job Type) | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం (Medical & Health Dept) |
| మొత్తం ఖాళీలు (Total Vacancies) | 529 పోస్టులు |
| పోస్టుల పేర్లు (Post Names) | Staff Nurse, Pharmacist, Multi Rehabilitation Worker (MRW) |
| దరఖాస్తు విధానం (Apply Mode) | ఆన్‌లైన్ ద్వారా (Online Mode) |
| ఉద్యోగ ప్రాంతం (Job Location) | ఆంధ్రప్రదేశ్ (Across Andhra Pradesh) |
| అధికారిక వెబ్‌సైట్ | apmsrb.ap.gov.in |
ఉద్యోగ ఖాళీల వివరాలు (Vacancy Details)
| క్రమ సంఖ్య | పోస్టు పేరు (Post Name) | ఖాళీల సంఖ్య |
|---|---|---|
| 1 | స్టాఫ్ నర్స్ (Staff Nurse) | 419 |
| 2 | ఫార్మసిస్ట్ (Pharmacist) | 24 |
| 3 | మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ (MRW - NPHCE) | 86 |
| మొత్తం ఖాళీల సంఖ్య (Total Post): | 529 | |
విద్యార్హతలు :
స్టాఫ్ నర్స్ :
స్టాఫ్ నర్స్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ & జీఎన్‌ఎం (Midwifery) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు ఏపీఎన్‌ఎంసీ రిజిస్ట్రేషన్ (రెన్యువల్‌తో) ఉండాలి.
ఫార్మసిస్ట్ :
ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునేవారు డీఫార్మసీ/బీఫార్మసీ లేదా ఏపీ ప్రభుత్వం గుర్తించిన ఫార్మసీ ఒకేషనల్ కోర్సు కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అవసరం.
మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ :
మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులకు 10+2 లేదా సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 1½ సంవత్సరాల మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికెట్ కోర్సు కంప్లీట్ చేసి ఉండాలి.
వయోపరిమితి వివరాలు (Age Limit)
| కేటగిరీ (Category) | గరిష్ట వయోపరిమితి (Age Limit) |
|---|---|
| జనరల్ అభ్యర్థులు (General / UR) |
కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 42 సంవత్సరాల లోపు ఉండాలి. |
| బీసీ / ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు (BC / SC / ST) |
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 సంవత్సరాల వయోసడలింపు కలదు (గరిష్టంగా 47 సంవత్సరాలు). |
| దివ్యాంగులు (PwBD) |
నిబంధనల ప్రకారం 10 సంవత్సరాల వయోసడలింపు కలదు (గరిష్టంగా 52 సంవత్సరాలు). |
శాలరీ :
స్టాఫ్ నర్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.27,675, ఫార్మసిస్ట్‌లకు రూ.23,393, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్లకు రూ.23,494 చొప్పున గౌరవ వేతనం అందుతుంది.
ఎంపిక విధానం (Selection Process)
ఈ పోస్టుల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. పూర్తి మెరిట్ మరియు వెయిటేజీ ఆధారంగా ఎంపిక జరుగుతుంది (మొత్తం 100 మార్కులకు):
అర్హత పరీక్ష మార్కులు (Qualifying Exam): గరిష్టంగా 75 మార్కులు.
కోర్సు పూర్తి చేసిన నాటి నుండి వెయిటేజీ: గరిష్టంగా 10 మార్కులు (సంవత్సరానికి 1 మార్కు చొప్పున).
ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజీ: గరిష్టంగా 15 మార్కులు.
కోవిడ్-19 విధులు: ప్రతి 6 నెలలకు 5.0 మార్కులు.
- గిరిజన ప్రాంతాలు (Tribal Area): ప్రతి 6 నెలలకు 2.5 మార్కులు.
- గ్రామీణ ప్రాంతాలు (Rural Area): ప్రతి 6 నెలలకు 2.0 మార్కులు.
- పట్టణ ప్రాంతాలు (Urban Area): ప్రతి 6 నెలలకు 1.0 మార్కు.
దరఖాస్తు విధానం : అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
ఈ పోస్టులకు అప్లై చేసే ఓసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ/ఎస్టీ/ బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగ అభ్యర్థులు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : జూన్ 30,2026.
కావలసిన పత్రాలు (Required Documents)
| ధృవపత్రాల వివరాలు (Document Name) |
|---|
| SSC సర్టిఫికేట్ (10th Class Memo) |
| ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ (Intermediate Memo) |
| స్టడీ సర్టిఫికేట్లు (4వ తరగతి నుండి 10వ తరగతి వరకు) |
| నర్సింగ్ / ఫార్మసిస్ట్ / MRW అర్హత సర్టిఫికేట్లు (Professional Qualification Memos) |
| APNMC / Pharmacy Council / RCI Registration సర్టిఫికేట్ |
| కుల ధృవీకరణ పత్రం (Caste Certificate) |
| EWS సర్టిఫికేట్ (వర్తించే వారికి) |
| PwBD సర్టిఫికేట్ (దివ్యాంగులకు వర్తించే విధంగా) |
| కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ (అవసరమైతే) |
ఆన్‌లైన్ దరఖాస్తు విధానం (Step-by-Step Process)
🔗 AP MSRB ముఖ్యమైన లింకులు (AP MSRB Important Links)
గమనిక: అభ్యర్థులు అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ వివరాలను ఒకసారి సరిచూసుకోవాల్సిందిగా మనవి.
