SSC CGL Recruitment 2025 Apply Online For 14582 Post Telugu - AP Job Alerts

 

SSC Combined Graduate Level Recruitment 2025: 

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2025 (CGLE)' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా దాదాపు 14582 ఖాళీలను భర్తీ చేయనున్నారు.


ఖాళీల సంఖ్య: 14582 

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 

➥ అసిస్టెంట్/అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 

➥ ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్

➥ ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్)

➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)

➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)

➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర

➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)

➥ ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)

➥ ఇన్‌స్పెక్టర్ 

➥ సెక్షన్ హెడ్

➥ అసిస్టెంట్/అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 

➥ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (CBIC)

➥ రిసెర్చ్ అసిస్టెంట్ (NHRC)

➥ డివిజనల్ అకౌంటెంట్ (కాగ్)

➥ సబ్ ఇన్‌స్పెక్టర్  (NIA)

➥ సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎన్‌సీబీ)

➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్)

➥ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ (హాంఅఫైర్స్)

➥ ఆఫీస్ సూపరింటెండెంట్(CBDT)

➥ ఆడిటర్ (కాగ్, సీజీడీఏ, etc.,)

➥ అకౌంటెంట్ (కాగ్, సీజీఏ, etc.,)

➥ అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్ 

➥ పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్)

➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్స్

➥ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్

➥ ట్యాక్స్ అసిస్టెంట్(CBDT)

➥ ట్యాక్స్ అసిస్టెంట్(CBIC)

➥ సబ్ ఇన్‌స్పెక్టర్


అర్హత: 

ఏదైనా డిగ్రీ. ఆడిట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ (కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ స్టడీస్)/ఎంబీఏ (ఫైనాన్స్) అర్హత ఉండాలి.


వయోపరిమితి: 

01.08.2025 నాటికి కొన్ని పోస్టులకు 18-27 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 20-30, కొన్ని పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

మరికొన్ని పోస్టులకు 18 - 32 సంవత్సరాలకు మించకూడదు. 

నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఢిఫెన్స్ అభ్యర్థులకు 3- సంవత్సరాలు, ఢిఫెన్స్ అభ్యర్థులకు (డిసేబుల్డ్) - 8 సంవత్సరాలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 40-45 సంవత్సరాల వరకు, ఒంటరి/విడాకులు తీసుకున్న మహిళలకు 35-40 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: 

జనరల్ / OBC అభ్యర్థులు: ₹100/-

SC / ST / PH / మహిళా అభ్యర్థులు: మినహాయింపు

రుసుములను నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా UPI ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: 

SSC CGL ఎంపిక నాలుగు దశలను కలిగి ఉంటుంది:

టైర్ I – కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)

టైర్ II – CBT (పోస్టును బట్టి పేపర్ I, II, మరియు III లు ఉంటాయి)

టైర్ III – వివరణాత్మక పత్రం (వర్తిస్తే)

డాక్యుమెంట్ వెరిఫికేషన్ & నైపుణ్య పరీక్షలు


జీతం: ఆయా పోస్టులను బట్టి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,42,400 జీతం ఉంటుంది. ఇతర భత్యాలు అదనం.


ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.06.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.07.2025 (23:00)

➥ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 05.07.2025 (23:00)

➥ దరఖాస్తుల సవరణ: 09.07.2025 - 11.07.2025(23:00) వరకు

➥ టైర్-1 పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 13 – 30 ఆగస్టు, 2025.

➥ టైర్-2 పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): డిసెంబరు, 2025. 



SSC CGL రిక్రూట్‌మెంట్ 2025 కి ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి

ఈ సాధారణ దశలను అనుసరించండి:

SSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://ssc.gov.in

చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ID మరియు ఫోన్ నంబర్‌తో నమోదు చేసుకోండి.

SSC CGL ఆన్‌లైన్ ఫారమ్ 2025 నింపండి.

అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి - ఫోటో, సంతకం, విద్యా ధృవీకరణ పత్రాలు.

దరఖాస్తు రుసుము చెల్లించండి (వర్తిస్తే).

భవిష్యత్తు సూచన కోసం నిర్ధారణ పేజీని సమర్పించి డౌన్‌లోడ్ చేసుకోండి.


Share this post with your friends.

See previous post See next post
No one has commented on this post yet.
Click here to comment.
comment url
X Close