RRC Secunderabad Jobs: సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు - AP Job Alerts


RRC South Central Railway Secunderabad Apprentice Recruitment 2025

దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో పదో తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది.దక్షిణ మధ్య రైల్వేకి చెందిన సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 4,232 ఎస్‌సీఆర్‌ వర్క్‌షాప్‌/ యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది.


సౌత్ సెంట్రల్ రైల్వే యూనిట్స్ : 

సికింద్రాబాద్, కాజీపేట, హైదరాబాద్, లాలాగూడ, మెట్టుగూడ, విజయవాడ, బిట్రగుంట, గూడూరు జంక్షన్, పూర్ణ జంక్షన్, ముద్‌ఖేడ్‌, కాకినాడ పోర్టు, కొండపల్లి, ఒంగోలు, రాజమండ్రి, రాయనపాడు, నల్లపాడు, గుంటూరు, మచిలీపట్నం, నర్సాపూర్, గుంతకల్, తిమ్మనచర్ల, యాద్‌గిర్‌, నాందెడ్‌.


ట్రేడుల వారీగా ఖాళీలు : 

ఎలక్ట్రీషియన్- 1053, 

పవర్ మెయింటెనెన్స్ (ఎలక్ట్రీషియన్)- 34,

 ట్రైన్‌ లైటింగ్ (ఎలక్ట్రీషియన్)- 34, 

ఫిట్టర్- 1742, 

కార్పెంటర్- 42, 

డీజిల్ మెకానిక్- 142, 

ఎలక్ట్రానిక్ మెకానిక్- 85, 

ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్- 10, 

ఏసీ మెకానిక్- 143, 

ఎయిర్ కండిషనింగ్- 32, 

ఎలక్ట్రికల్ (ఎస్‌&టి) (ఎలక్ట్రీషియన్)- 10, 

మోటార్ మెకానిక్ వెహికల్ (ఎంఎంవీ)- 08, 

మెషినిస్ట్- 100, 

మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ (ఎంఎంటీఎం)- 10,

 పెయింటర్‌- 74, 

వెల్డర్- 713.

మొత్తం పోస్టుల సంఖ్య: 4232 

(ఎస్సీ- 635, ఎస్టీ- 317, ఓబీసీ- 1143, ఈడబ్ల్యూఎస్‌- 423, యూఆర్‌- 1714)


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.


వయస్సు: 28.12.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.


ఎంపిక ప్రక్రియ: పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంది.


దరఖాస్తు ఫీజు: రూ.100/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).


ముఖ్య తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 28-12-2024.

 ఆన్‌లైన్ దరఖాస్తులు చివరి తేదీ: 27-01-2025.

1 Comments

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share