AP Jobs: ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖలో 70 ఉద్యోగాలు.. నెలకు రూ.35,000 వరకు జీతం..అర్హత, చివరి తేదీ వివరాలివే ! - AP job alerts

AP Jobs: ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖలో 70 ఉద్యోగాలు.. నెలకు రూ.35,000 వరకు జీతం..అర్హత, చివరి తేదీ వివరాలివే!

AP Endowments Department Recruitment 2024 : ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయశాఖలో 70 ఇంజినీరింగ్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ ప్రకటన ద్వారా 35 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్‌) పోస్టులు, 5 ఏఈఈ (ఎలక్ట్రికల్‌) పోస్టులు, 30 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (సివిల్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.


ఖాళీల వివరాలు:

1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 35 పోస్టులు

2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 05 పోస్టులు.

3. టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్): 30 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 70.


అర్హత:  టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంజినీరింగ్‌ డిప్లొమా అర్హత ఉండాలి. ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్‌ (సివిల్/ ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు ఏఈఈకి రూ.35,000; టీఏకు రూ.25,000తో పాటు అదనపు అలవెన్సు. చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 05-01-2025.


Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share