మా వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి
Join Now

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాలు - AP Job Alerts

 

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాలు

కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఐబీలో 797 జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిప్లొమా / డిగ్రీ పూర్తిచేసి ఆసక్తికలిగిన అభ్యర్థులు జూన్‌ 3 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

Organization Intelligence Bureau
Post Name JIO-II/Tech
Vacancies 797 Posts
Application Mode Online
Last Date to Apply Online 23rd June 2023
Selection Process
  • Tier I – Online Exam
  • Tier II – Skill Test
  • Tier III – Interview/ Personality Test
Salary Level-4 (Rs. 25,500- 81,100)
Job Location All Over India


ఖాళీల వివరాలు…


జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (జేఐవో) గ్రేడ్‌-2/ టెక్నికల్‌: 797 పోస్టులు 

(యూఆర్‌- 325, ఎస్సీ- 119, ఎస్టీ- 59, ఓబీసీ- 215, ఈడబ్ల్యూఎస్‌- 79)


విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ / విద్యా సంస్థ నుంచి డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) లేదా బ్యాచిలర్‌ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఫిజిక్స్/ మేథమెటిక్స్‌ సబ్జెక్టులుగా ఉండాలి). లేదా బీసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయో పరిమితి : 18 నుంచి 27 ఏళ్లు లోపు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు/ ఓబీసీలకు మూడేళ్లు చొప్పున వయో సడలింపు ఉంటుంది.

వేతన స్కేలు : రూ.25,500 – రూ.81,100 (కేంద్రం ఇచ్చే ఇతర అలవెన్సులు అదనం)

ఎంపిక ప్రక్రియ :
రాత పరీక్ష (100 మార్కులు), స్కిల్ టెస్ట్ (30 మార్కులు), ఇంటర్వ్యూ (20 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎమినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


దరఖాస్తు రుసుము :
రూ.500.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల కేంద్రాలు : అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : జూన్ 03, 2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : జూన్ 23, 2023

ఫీజు చెల్లింపు చివరి తేదీ : 27-06-2023. 


Share this post with your friends.
మా వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి
Join Now
See previous post See next post
No one has commented on this post yet.
Click here to comment.
comment url
Wait for 5s...
X Close