Telugu General Knowledge - 14 - జనరల్ నాలెడ్జ్ - 14 - AP Job Alerts



Telugu General Knowledge - 14 - జనరల్ నాలెడ్జ్ - 14 :-

తెలుగు Daily Telugu GK Bits ను ఈ వెబ్సైట్ - AP Job Alerts . in లో అందిస్తున్నాము. అన్నిAPPSC, TSPSC, SI, కానిస్టేబుల్, VRO, VRA, గ్రూప్స్, SSC, RRB , AP DSC , AP TET ,బ్యాంక్ పరీక్షలు మొదలైన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కరెంట్ అఫైర్స్‌ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.


1. సౌరకుటుంబం మణిహారంగా ఏ గ్రహాన్ని పిలుస్తారు?

 Ans:- శనిగ్రహం


2. ఏ గ్రహాన్ని God of Agriculture గా పేర్కొంటారు?

 Ans:- శనిగ్రహం


3. సౌరకుటుంబంలో రెండవ అతిపెద్ద గ్రహం ఏది?

 Ans:- శనిగ్రహం


4. సౌరకుటుంబంలో అత్యల్ప సాంద్రత గల గ్రహం ఏది?

 Ans:- శనిగ్రహం


5. Orange Planet అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?

 Ans:- శనిగ్రహం


6. అందమైన వలయాలు గ్రహం ఏది?

 Ans:- శనిగ్రహం


7. Golden Planet అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?

 Ans:- శనిగ్రహం


8. శనిగ్రహానికి గల ఉపగ్రహాలు ఎన్ని?

 Ans:- 82 ఉపగ్రహాలు (ధృవీకరించబడినవి 53, గుర్తించబడినవి 29)


9. Green Planet అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?

 Ans:- యురేనస్


10. God of the Sky అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?

 Ans:-యురేనస్


11. గతితప్పిన గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?

 Ans:- యురేనస్


12. యురేనస్ కు గల ఉపగ్రహాలు ఎన్ని?

 Ans:- 27 (మిరిండా, ఏరియల్, టిటానియా ముఖ్యమైనవి)


13. నిర్మాణుష్య గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?

 Ans:- నెప్ట్యూన్


14. సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం?

 Ans:- నెప్ట్యూన్


15. సౌరకుటుంబంలో అతిశీతల గ్రహం ఏది?

 Ans:- నెప్ట్యూన్


16. నెప్ట్యూన్ కి గల ఉపగ్రహాలు ఎన్ని?

 Ans:- 14 ఉపగ్రహాలు


17. అంతర గ్రహాలు అని వేటిని అంటారు?

 Ans:- సూర్యునికి దగ్గరగా ఉన్న నాలుగు గ్రహాలు (1. బుధుడు 2. శుక్రుడు 3. భూమి 4. అంగారకుడు)


18. బాహ్య గ్రహాలు అని వేటిని అంటారు?

 Ans:- సూర్యునికి దూరంగా ఉన్న నాలుగు గ్రహాలను (1. బృహస్పతి 2. శని 3. యురేనస్ 4. నెప్ట్యూన్)


19. ఉల్కలు అని వేటిని అంటారు?

 Ans:- సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళను


20. గ్రహశకలాలు అని వేటిని అంటారు?

 Ans:- అంగారకుడు, బృహస్పతిల మధ్యగల గ్రహ శిథిలాలను


21. జియోయిడ్ ఆకారంలో ఉండే గ్రహం ఏది?

 Ans:- భూమి


22. ప్రతీ 76 సం.లకు ఒకసారి భూమికి దగ్గరగా వచ్చే తోకచుక్క ఏది?

 Ans:- హేలీ తోకచుక్క


23. గ్రహాలలో రాజు అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?

 Ans:- గురుడు


24. షూటింగ్ స్టార్స్ అని వేటిని అంటారు?

 Ans:- ఉల్కలను


25. భూమికి గల చలనాలు ఏవి?

 Ans:- 1. భూ భ్రమణం 2. భూ పరిభ్రమణం


26. భూమి యొక్క ఏ చలనం వలన రాత్రి పగళ్ళు ఏర్పడతాయి?

 Ans:- భూ భ్రమణం వలన


27. భూమి యొక్క ఏ చలనం వలన ఋతువులు ఏర్పడతాయి?

 Ans:- భూ పరిభ్రమణం


28. భూ భ్రమణం అంటే ఏమిటి?

 Ans:- భూమి తన చుట్టూ తాను తిరగడం


29. భూ పరిభ్రమణం అంటే ఏమిటి?

 Ans:- భూమి సూర్యుని చుట్టూ తిరగడం


30. గ్లోబు మీద భూమధ్యరేఖకు సమాంతరంగా గీసిన ఊహారేఖలను ఏమంటారు?

 Ans:- అక్షాంశాలు


31. గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసనట్లు ఉండే రేఖలను ఏమంటారు?

 Ans:- రేఖాంశాలు


32. ఏ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం లేదా ప్రామాణిక రేఖాంశం అంటారు?

 Ans:- 0° రేఖాంశాన్ని


33. భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న అర్థభాగాన్ని ఏమంటారు?

 Ans:- ఉత్తరార్ధగోళం


34. భూమధ్యరేఖకు దక్షిణంగా ఉన్న అర్థభాగాన్ని ఏమంటారు?

 Ans:- దక్షిణార్థ గోళం


35. గ్రీనిచ్ (0°) రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్థగోళాన్ని ఏమంటారు?

 Ans:- తూర్పు అర్థగోళం


36. గ్రీనిచ్ (0°) రేఖాంశానికి పశ్చిమంగా ఉన్న అర్థగోళాన్ని ఏమంటారు?

 Ans:- పశ్చిమ అర్థగోళం


37. ఏ అక్షాంశాన్ని ఉత్తర ధృవం అంటారు?

 Ans:- 90° ఉత్తర అక్షాంశాన్ని


38. ఏ అక్షాంశాన్ని దక్షిణ ధృవం అంటారు?

 Ans:- 90° దక్షిణ అక్షాంశాన్ని


39. ఏ అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు?

 Ans:- 66½° ఉత్తర అక్షాంశాన్ని


40. ఏ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అంటారు?

 Ans:- 66½ దక్షిణ అక్షాంశాన్ని


41. ఏ అక్షాంశాన్ని కర్కటరేఖ అంటారు?

 Ans:- 23½° ఉత్తర అక్షాంశాన్ని


42. ఏ అక్షాంశాన్ని మకరరేఖ అంటారు?

 Ans:- 23½° దక్షిణ అక్షాంశాన్ని


43. ఏ రేఖాంశాన్ని “అంతర్జాతీయ దినరేఖ” అంటారు?

 Ans:- 180° తూర్పు & పశ్చిమ రేఖాంశాన్ని


44. మధ్యాహ్న రేఖలు అని వేటిని అంటారు?

 Ans:- రేఖాంశాలను


45. అక్షాంశాలు ఏ దిశలలో ఉంటాయి?

 Ans:- తూర్పు మరియు పశ్చిమ దిశలలో


46. రేఖాంశాలు ఏ దిశలలో ఉంటాయి?

 Ans:- ఉత్తరం మరియు దక్షిణ దిశలలో


47. ఏ తేదీలలో భూమి అంతటా రాత్రి, పగళ్ళు సమానంగా ఉంటాయి?

 Ans:- మార్చి 21 మరియు సెప్టెంబరు 23 (విషవత్తులు)


48. ఏ తేదీన సూర్యకిరణాలు మకరరేఖ మీద పడతాయి?

 Ans:- డిసంబర్ 22న


49. పురాతన ఖగోళ గ్లోబును రూపొందించినది ఎవరు?

 Ans:- మార్టిన్ బెహైమ్ (1492)


50. ఆధునిక ఖగోళ గ్లోబును రూపొందించినది ఎవరు?

 Ans:- టకి అల్ దిన్ (1570)

Next Post Previous Post
error: Content is protected !!
×
SPONSORED AD
You can close in 5s...