PM Surya Ghar Yojana: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. ఇలా చేస్తే జీరో కరెంట్ బిల్.. ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది! - AP Job Alerts



PM Surya Ghar Yojana : 

నెల పూర్తయ్యే సరికి అందరికీ కరెంట్ బిల్లు టెన్షన్ పట్టుకుంటుంది. ఈ సారి బిల్లు ఎంత వస్తుందోననే గుబులు చాలా మందిలో ఉంటుంది. అయితే బిల్లు గురించి టెన్షన్ పడకుండా, ఇంట్లో కరెంట్‌తో డబ్బులు సంపాదించే చాన్స్ ఉంది. దాని గురించి మీకు తెలుసా?


ఏంటా స్కీమ్?

- గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కింద అమల్లోకి వచ్చిన ఆ స్కీమ్ పేరు పీఎం సూర్య ఘర్ యోజన.

- దీని కింద సోలార్ ప్యానెల్స్, రూఫ్స్ ఇన్‌స్టాలేషన్ కోసం సబ్సిడీ ఇస్తోంది కేంద్రం. 

- ఈ స్కీమ్ కింద సోలార్ ప్యానెల్స్‌ను తమ ఇళ్ల మీద అమర్చుకున్న వారికి ప్రతి నెలా 300 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇస్తోంది సర్కారు. అయితే ఈ కరెంట్‌ను కేవలం ఇంటికే వాడుకోవాల్సిన అవసరం లేదు. 

- ఇంట్లో వినియోగం పోనూ మిగిలిని విద్యుత్‌ను తిరిగి ప్రభుత్వానికి అమ్మేసి డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు తెలుసుకుందాం..


ఏ ప్యానెల్ తీసుకోవాలి?

- ప్రతి నెలా మీ ఇంట్లో ఎంత విద్యుత్‌ వాడుతున్నారనేది తెలుసుకోవాలి. 

- దాన్ని బట్టి సోలార్ ప్యానెల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గనుక 150 యూనిట్ల వరకు విద్యుత్‌ వాడుతున్నట్లయితే 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్‌ను అమర్చాలి. 

- ఒకవేళ 200 నుంచి 250 యూనిట్ల వరకు కరెంట్ వినియోగిస్తున్నట్లయితే 2 కిలోవాట్స్ ప్యానెల్‌ తీసుకోవాలి. విద్యుత్ వాడకం 300 యూనిట్లు లేదా అంతకుమించి ఉంటే 3 కిలోవాట్స్ ప్యానెల్ అమర్చాలి. 

- ఈ స్కీమ్ కింద ప్రతి ప్యానెల్ ధరను బట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుంది.


ఎలా అమ్మాలి?

- సోలార్ ప్యానెల్స్ నుంచి వచ్చే విద్యుత్‌తో డబ్బులు సంపాదించాలని భావిస్తున్నట్లయితే ఒక పని చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో నెలవారీ విద్యుత్ వాడకం 200 యూనిట్లు ఉందనుకుందాం. 

- అందుకు తగ్గట్లు మీరు 2 కిలోవాట్స్ సోలార్ ప్యానెల్ అమర్చారు. అది 250 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తే.. మీ ప్యానెల్‌లో ఇంకా 50 యూనిట్ల కరెంట్ మిగిలిపోయినట్లే. 

- మీ వాడకం పోనూ మిగిలిన ఈ ఎలక్ట్రిసిటీని ప్రభుత్వానికి అమ్మేయొచ్చు. ఏడాది మొత్తం మీ ఇంటి వాడకం పోనూ సోలార్ ప్యానెల్‌లో మిగిలిపోయిన విద్యుత్‌ను ప్రభుత్వం తీసుకుంటుంది. 

- ఎన్ని యూనిట్లు అమ్మారో అంత డబ్బును నేరుగా మీ అకౌంట్‌లో వేసేస్తుంది. 

- పీఎం సూర్య ఘర్ యోజన ద్వారా ఏడాదికి సుమారుగా రూ.15 నుంచి రూ.18 వేల వరకు సంపాదించుకోవచ్చని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.


ఈ డాక్యుమెంట్స్​ ఉండాలి!

- ఆధార్ కార్డు

- విద్యుత్ బిల్లు

- రేషన్ కార్డు

- మొబైల్ నెంబర్

- బ్యాంకు ఖాతా పాస్ బుక్,

- ఈమెయిల్

- ఈ సోలార్ ప్యానెల్ అమర్చుకోవడానికి 35 గజాల స్థలం అవసరం.


ఇలా అప్లై చేయండి!

- ముందుగా పీఎం సూర్యఘర్‌ pmsuryaghar.gov.in ) పోర్టల్‌లో పేరును రిజిస్టర్‌ చేసుకోండి. ఇందుకోసం మీ రాష్ట్రం, విద్యుత్‌ సరఫరా చేసే కంపెనీని సెలెక్ట్​ చేసుకోవాలి.

- ఆపై మీ విద్యుత్‌ కనెక్షన్‌ కన్జ్యూమర్‌ నెంబరు, మొబైల్‌ నెంబరు, ఈ-మెయిల్‌ ఐడీని ఎంటర్ చేయండి.

- ఇప్పుడు కన్జ్యూమర్‌ నెంబర్‌, మొబైల్‌ నంబర్‌తో సైట్​లో లాగిన్‌ అవ్వాలి. అక్కడ 'రూఫ్‌టాప్‌ సోలార్‌' కోసం అప్లై చేసుకోవాలి.

- అప్లికేషన్ పూర్తి చేసి డిస్కమ్‌ నుంచి అనుమతులు వచ్చేవరకు వెయిట్​ చేయాలి.

- అనుమతి వచ్చిన అనంతరం మీ డిస్కమ్‌లోని నమోదిత విక్రేతల నుంచి సోలార్‌ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

- ఇన్‌స్టలేషన్‌ పూర్తయిన అనంతరం, ఆ ప్లాంట్‌ వివరాలను పోర్టల్‌లో సమర్పించి నెట్‌ మీటర్‌ కోసం అప్లై చేసుకోవాలి.

- నెట్‌ మీటర్‌ను ఇన్‌స్టాల్‌ చేశాక, డిస్కమ్‌ అధికారులు చెక్ చేస్తారు. అలాగే పోర్టల్‌ నుంచి కమిషనింగ్‌ సర్టిఫికేట్‌ ఇస్తారు.

- ఈ రిపోర్ట్‌ పొందిన అనంతరం మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్‌ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్‌ చేయాలి. ఇలా చేస్తే 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.

Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share