IDBI BANK: డిగ్రీ అర్హతతో 676 ఉద్యోగాలు.. జీతం మాత్రం రూ.6,00,000 .. - AP Job Alerts
IDBI Bank Assistant Manager Recruitment :-
ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ (IDBI BANK) దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు మే 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 676
పోస్టులు :
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం) గ్రేడ్- ఓ: 676 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా తెలిసి ఉండాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉండగా.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉండగా.. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి భర్తీ చేస్తారు.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఏడాదికి రూ.6లక్షల వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1050 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 మే 8
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మే 20
అఫీషియల్ వెబ్ సైట్: https://www.idbibank.in/
ఎలా అప్లై చేయాలి ?
ఐడిబిఐ బ్యాంకు ఉద్యోగాలకు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజ్ కెరియర్ సెక్షన్ లోకి వెళ్ళండి
- అక్కడ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఆన్లైన్ అప్లై లింక్ ఉంటుంది దాని పైన క్లిక్ చేయండి.
- అప్లికేషన్ లోని పూర్తి వివరాలు నింపి, అప్లికేషన్ ఫీజు చెల్లించండి
- ఆఖరుగా అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url