HDFC Bank PO Recruitment 2025: Apply Online For 500 Posts Telugu - AP Job Alerts



HDFC Bank PO Recruitment 2025 : 

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్‌) సహకారంతో రిలేషన్‌షిప్ మేనేజర్ - ప్రొబేషనరీ ఆఫీసర్ (పిఓ) ప్రోగ్రామ్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 7వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలి.


రిలేషన్‌షిప్‌ మేనేజర్ (RM) పోస్టులు - 500

అర్హత:

 అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే 1 - 10 సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉండాలి.


వయసు: 

దరఖాస్తు చివరి తేదీ అయిన ఫిబ్రవరి 7, 2025 నాటికి 35 ఏళ్లు మించకూడదు.


జీతం: 

ఏడాదికి రూ.3,00,000 - రూ.12,00,000 వరకు ఉంటుంది.


దరఖాస్తు విధానం: 

ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: 

ఆన్‌లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


జాబ్‌ లొకేషన్‌: 

దేశవ్యాప్తంగా గల ప్రధాన నగరాల్లో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.


పరీక్ష కేంద్రాలు:

విశాఖపట్నం, ఢిల్లీ, అహ్మాదాబాద్‌, వడోదర, బెంగళూరు, మంగళూరు, భోపాల్‌, ముంబయి, పుణె, అమృత్‌సర్‌, జయపుర, హైదరాబాద్‌, లఖ్‌నవూ, కోల్‌కతా నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.


ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: డిసెంబర్‌ 30, 2024

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 7, 2025

ఆన్‌లైన్ పరీక్ష: మార్చి 2025

.

Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share