AP Jobs ; ఆంధ్రప్రదేశ్‌లో 1,289 ఉద్యోగాలు.. పోస్టులను బట్టి రూ.97,750 వరకు జీతం.. పూర్తి వివరాలివే - AP Job Alerts


AP DME Senior Resident Recruitment 2024-25 :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లోని వివిధ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్, సూపర్‌ స్పెషాలిటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 1,289

సీనియర్ రెసిడెంట్ (క్లినికల్) పోస్టులు - 603
సీనియర్ రెసిడెంట్ (నాన్ క్లినికల్) పోస్టులు - 590
సీనియర్ రెసిడెంట్ (సూపర్ స్పెషాలిటీ) పోస్టులు - 96


స్పెషాలిటీలు: జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, అనెస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆఫ్తాల్మాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్, సైకియాట్రి, రేడియో డయాగ్నోసిస్‌/రేడియాలజీ, ఎమర్జన్సీ మెడిసిన్, రేడియోథెరపీ, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్‌ మెడిసిన్, అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, కమ్మూనిటీ మెడిసిన్, కార్డియాలజీ,ఎండోక్రైనాలజీ, మెడికల్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరాలజీ, కార్డియో థొరాసిక్‌ సర్జరీ/సీవీటీ సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ, పీడియాట్రిక్‌ సర్జరీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, సర్జికల్‌ అంకాలజీ, మెడికల్‌ అంకాలజీ, నియోనాటాలజీ.


విద్యార్హతలు: మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ ఎండీఎస్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 44 ఏళ్లు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు బ్రాడ్ స్పెషాలిటీ పోస్టులకు రూ.80,500.. సూపర్ స్పెషాలిటీ పోస్టులకు రూ.97,750 చెల్లిస్తారు.

పదవీ కాలం: ఎంపికైన అభ్యర్థులు ఏడాది పని చేయాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: పోస్టు గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.2000.. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 8, 2025


Next Post Previous Post
error: Content is protected !!
×
SPONSORED AD
You can close in 5s...