APCOB Jobs: ఆంధ్రప్రదేశ్‌ DCCB గుంటూరులో ఉద్యోగాలు.. డిగ్రీ, పీజీ అర్హత.. ప్రారంభంలో నెలకు రూ.44,610 వరకు జీతం - AP JOB ALERTS



APCOB  Recruitment 2025 :-

గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB).. జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 31 అసిస్టెంట్‌ మేనేజర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.


అసిస్టెంట్‌ మేనేజర్‌ ఖాళీల సంఖ్య - 31


అర్హత: గుర్తింపు పొందిన యునివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థి తెలుగు/ ఇంగ్లిష్‌ భాషల్లో (చదవటం/ రాయడం) ప్రావీణ్యం, కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి.


వయోపరిమితి: 31.10.2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.


జీతం: నెలకు రూ.26,080- రూ.57,860 వరకు ఉంటుంది. ప్రారంభంలో డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకుని నెలకు రూ.44,610 వరకు పొందవచ్చు.


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


ఆన్‌లైన్‌ టెస్ట్‌ సెంటర్లు : గుంటూరు, పల్నాడు, బాపట్లలో జిల్లాల్లోని సెంటర్లలో నిర్వహిస్తారు. కాల్‌ లెటర్‌లో ఎగ్జామ్‌ సెంటర్‌ వివరాలు తెలియజేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా అప్లయ్‌ చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.700.. ఎస్సీ/ ఎస్టీ/ పీసీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.500.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 22, 2025

Post a Comment

0 Comments