CWC : కేంద్ర ప్రభుత్వ సంస్థ CWC మొత్తం 179 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. - AP JOB ALERTS
CWC Recruitment 2024 : న్యూఢిల్లీలోని ప్రభుత్వ నవరత్న సంస్థ- సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (Central Warehousing Corporation) భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 179 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 12 దరఖాస్తులకు చివరితేదీగా నిర్ణయించారు. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఖాళీల వివరాలు:
1. మేనేజ్‌మెంట్ ట్రైనీ (జనరల్): 40 పోస్టులు
2. మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్): 13 పోస్టులు
3. అకౌంటెంట్: 09 పోస్టులు
4. సూపరింటెండెంట్ (జి): 22 పోస్టులు
5. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 81 పోస్టులు
6. సూపరింటెండెంట్ (జి)- ఎస్‌ఆర్‌డీ (ఎన్‌ఈ): 02 పోస్టులు
7. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- ఎస్‌ఆర్‌డీ (ఎన్‌ఈ): 10 పోస్టులు
8. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- ఎస్‌ఆర్‌డీ (లడఖ్ యూటీ): 02 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 179.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీకాం, బీకాం, సీఏ, పీజీ, ఎంబీఏ, ఉత్తీర్ణులై ఉండాలి.
జీత భత్యాలు: నెలకు మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.60000- రూ.1,80,000; అకౌంటెంట్/ సూపరింటెండెంట్ పోస్టులకు రూ.40000- రూ.140000; జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.29000- రూ.93000.
గరిష్ఠ వయో పరిమితి: 12.01.2025 నాటికి అకౌంటెంట్, సూపరింటెండెంట్ పోస్టులకు 30 సంవత్సరాలు; ఇతర పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: యూఆర్, ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1350. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ పీహెచ్/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.500.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.01.2025.
ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లింపు తేదీలు: 14.12.2024 నుంచి 12.01.2025 వరకు.
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url