AP Postal Jobs 2025: 1215 Jobs in Andhra Pradesh Postal Department.. Job without Exam - AP Job Alerts

 


India Post GDS Recruitment 2025:

పోస్టల్ శాఖ నుంచి గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో 1,215 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

   

పోస్టు పేరు: గ్రామీణ డాక్ సేవక్ (GDS).

ఖాళీల సంఖ్య: 1,215.

భర్తీ విధానం: మెరిట్ ఆధారంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్.


విద్యార్హత: 10వ తరగతి (SSC/Matriculation) ఉత్తీర్ణత.


ఇతర అర్హతలు:

➛ కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.

➛ సైకిల్ లేదా స్కూటర్ నడిపే నైపుణ్యం ఉండాలి.


వయోపరిమితి:

➛ కనీసం 18 సంవత్సరాలు.

➛ గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలు.


వయో పరిమితిలో సడలింపు:

➛ SC/ST: 5 సంవత్సరాలు.

➛ OBC: 3 సంవత్సరాలు.

➛ PWD (General): 10 సంవత్సరాలు.

➛ PWD (OBC): 13 సంవత్సరాలు.

➛ PWD (SC/ST): 15 సంవత్సరాలు.


దరఖాస్తు రుసుము:

➛ జనరల్/OBC/EWS అభ్యర్థులకు: ₹100.

➛ SC/ST/PWD & మహిళ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు.


వేతనం: 

➛ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్: ₹12,000 – ₹29,380

➛ డాక్ సేవక్ & అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్: ₹10,000- to ₹24,470


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ఎంపిక విధానం:

➛ పూర్తిగా మెరిట్ ఆధారంగా (Merit-based selection). మెరిట్ లిస్ట్ లోని అభ్యర్థుల జాబితాను 10వ తరగతి మార్కుల ఆధారంగా రూపొందిస్తారు.

➛ అభ్యర్థులను ఎంపిక చేయడానికి పూర్తి విద్యార్హతలో పొందిన మార్కుల ఆధారంగా మాత్రమే ఆధారపడతారు.

➛ రైటింగ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ లేదా ఇతర పరీక్షలు నిర్వహించబడవు.


ప్రారంభ దరఖాస్తు తేదీ: ఫిబ్రవరి 10, 2025.

దరఖాస్తు చివరి తేదీ: మార్చి 3, 2025.

ఎడిట్/కరెక్షన్ విండో: మార్చి 6, 2025 నుండి మార్చి 8, 2025.


దరఖాస్తు విధానం:

అభ్యర్థులు https://indiapostgdsonline.cept.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు సమర్పణకు ముందు వన్-టైమ్ రిజిస్ట్రేషన్ అవసరం.

అవసరమైన సర్టిఫికెట్లను స్కాన్ చేసిన కాపీలను మాత్రమే అప్‌లోడ్ చేయాలి.

06.03.2025 నుండి 08.03.2025 వరకు తప్పులు కరెక్షన్‌ విండో అందుబాటులో ఉంటుంది కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా ఖచ్చితమైన వివరాలను నిర్ధారించుకోవాలి.


Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share