SBI SCO : బీటెక్ అర్హతతో స్టేట్‌ బ్యాంక్‌లో 169 ఉద్యోగాలు.. రూ.85,920 వరకు జీతం.. SBI SCO నోటిఫికేషన్‌ విడుదల- ap job alerts


SBI SCO Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.


మొత్తం ఖాళీల సంఖ్య : 169 పోస్టులు

అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- సివిల్) పోస్టులు : 42 పోస్టులు

అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఎలక్ట్రికల్)పోస్టులు : 25 పోస్టులు

అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఫైర్) పోస్టులు : 101

అసిస్టెంట్ మేనేజర్ బ్యాక్‌లాగ్ ఖాళీలు పోస్టులు : (ఇంజినీర్- సివిల్): 01


అర్హతలు: 

బీఈ/ బీటెక్‌ (సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఫైర్/ సేఫ్టీ అండ్‌ ఫైర్ ఇంజినీరింగ్/ ఫైర్ టెక్నాలజీ అండ్‌ సేఫ్టీ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 

01.10.2024 నాటికి అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఫైర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు.. ఇతర పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.


బేసిక్ పే స్కేల్: 

నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు చెల్లిస్తారు.


దరఖాస్తు ఫీజు: 

రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).


ఎంపిక విధానం: 

ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటరాక్షన్ ఆధారంగా.. 

అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్-ఫైర్) పోస్టులకు అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటరాక్షన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.


జాబ్‌ లొకేషన్‌:

దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో ఈ నియామకాలు ఉంటాయి.


దరఖాస్తు విధానం : 

ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.


ముఖ్యమైన తేదీ:

దరఖాస్తులు ప్రారంభ తేది: నవంబర్‌ 22, 2024

దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్‌ 12, 2024

ఫీజు చెల్లింపునకు చివరితేది: డిసెంబర్‌ 12, 2024


Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share