APSLPRB SI Hall Ticket 2023 : ఈనెల 14,15 తేదీల్లో ఎస్‌ఐ ఫైనల్ రాత పరీక్షలు.. SLPRB AP వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు విడుదల
APSLPRB SI Hall Ticket Download 2023 :
☛ ఆంధ్రప్రదేశ్‌లో 411 ఎస్సై ఉద్యోగ నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్షల కొరకు హల్టికెట్స్ విడుదల
☛ అక్టోబర్ 14, 15 తేదీల్లో తుది పరీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ ఉద్యోగార్థులకు అలర్ట్. రాష్ట్రంలో 411 ఎస్‌ఐ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఫైనల్ రాత పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పీఎంటీ/ పీఈటీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అక్టోబర్ 14, 15 తేదీల్లో ఫైనల్ రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ పోలీసు నియామక మండలి (APSLPRB) ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులు ఈరోజు (అక్టోబర్ 6)వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 12వ తేదీ వరకు హాల్‌టికెట్లు (APSLPRB SI Hall Ticket 2023) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
◼️ అభ్యర్థులకు మొత్తం నాలుగు పేపర్ల పరీక్ష ఉంటుంది.
◼️ ఇందులో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో.. రెండు పేపర్లు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి.
- అక్టోబర్ 14వ తేదీ ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1; మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్-2 (రెండూ డిస్క్రిప్టివ్ విధానంలో) జరుగుతాయి.
- అక్టోబర్ 15 ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-3; మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్-4 (రెండూ ఆబ్జెక్టివ్ విధానంలో) నిర్వహిస్తారు.
◼️ విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.