Anganwadi Jobs 2023 : శ్రీసత్యసాయి జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 65 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వాళ్లు అప్లయ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 29 దరఖాస్తులకు చివరితేది.
మొత్తం ఖాళీలు : 65
అంగన్‌వాడీ వర్కర్
అంగన్‌వాడీ హెల్పర్
మినీ అంగన్‌వాడీ వర్కర్
ఐసీడీఎస్ ప్రాజెక్టు పేరు : హిందూపూర్, ధర్మవరం, సీకే పల్లి, మడకశిర, పెనుకొండ, కదిరి, నల్లచెరువు, గుడిబండ, సోమందేపల్లి, పుట్టపర్తి, ఓబుళదేవరచెరువు.
వయోపరిమితి : 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
వేతనం: అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11500, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000 వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత శ్రీసత్యసాయి జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: సెప్టెంబర్ 29, 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://srisathyasai.ap.gov.in/