UCIL లో 107 మైనింగ్ పోస్టులు: 10వ తరగతి అర్హత పూర్తి వివరాలు ఇవే.! - AP Job Alerts



 
UCIL: యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 107 పోస్టులు

ఝార్ఖండ్లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(UCIL) రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మైనింగ్ మేట్, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్, బాయిలర్ ఆపరేటర్ కమ్ కంప్రెసర్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు డిసెంబరు 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.


పోస్టు పేరు - ఖాళీలు

1. మైనింగ్ మేట్ (సి) - 95

2. వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ (బి) - 09

3. బాయిలర్-కమ్-కంప్రెసర్ అటెండెంట్ (ఏ): 03

మొత్తం ఖాళీల సంఖ్య - 107


అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు డిజీఎంఎస్ జారీ చేసిన వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ కాంపిటెన్సీ, మైనింగ్ మేట్ / ఫోర్మెన్ సర్టిఫికేట్తో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.


గరిష్ఠ వయోపరిమితి: మైనింగ్ మేట్ 40 ఏళ్లు; వైండింగ్ ఇంజిన్ డ్రైవర్కు 32 ఏళ్లు; బాయిలర్-కమ్-కంప్రెసర్ అటెండెంట్కు 30 ఏళ్లు మించకూడదు.


వేతనం: నెలకు మైనింగ్ మేట్కు రూ.29,190-రూ.45,480; వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ (బీ) కు రూ.28,790 - రూ.44,850;  బాయిలర్-కమ్-కంప్రెసర్ అటెండెంట్ (ఏ):రూ.28.390-రూ.44.230.


ఎంపిక విధానం: రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ సైకోమెట్రిక్ టెస్ట్/గ్రూప్ ఎక్సర్సైజ్/ పర్సనల్ ఇంటర్వ్యూ, ఆధారంగా.


దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, అభ్యర్థులకు ఫీజు లేదు.


దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 01-12-2025

ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 31-12-2025.


UCIL రిక్రూట్‌మెంట్ 2025 కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ లింక్ ఇది:



దరఖాస్తుకు సంబంధించిన గమనికలు:

నోటిఫికేషన్ చూడటానికి: మీరు ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి, సాధారణంగా "Career" లేదా "Recruitment" సెక్షన్‌లో Advertisement No. UCIL-07/2025 ని చూడవచ్చు.


ఆన్‌లైన్ దరఖాస్తు: ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ డిసెంబర్ 01, 2025 (ఉదయం 10:00 గంటల నుండి) నుండి ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తుంది.

Post a Comment

0 Comments