RRB Group D Recruitment 2025 Notification Out, 32438 Vacancies Telugu - AP Job Alerts

RRB Group D Recruitment 2025 : రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్‌. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఏకంగా 32,438 గ్రూప్‌-డి పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం లెవల్-1 పోస్టులకు సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.


పోస్టుల వివరాలు

RRB Group D Posts : 

పాయింట్స్‌మన్, అసిస్టెంట్, 

ట్రాక్ మెయింటెయినర్, 

అసిస్టెంట్ లోకో షెడ్, 

అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర పోస్టులు ఉన్నాయి. 

ఇవన్నీ లెవల్ -1 గ్రూప్-డీ పోస్టులు. 

మొత్తం 32,438 పోస్టులు ఉన్నాయి.


విభాగాలు

ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్‌ మొదలైనవి.


విద్యార్హతలు - RRB Group D Eligibility : 

అభ్యర్థులు 10వ తరగతి, ఐటీఐ అర్హతలతో పాటు, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.


వయోపరిమితి - RRB Group D Age Limit : 

అభ్యర్థుల వయస్సు 2025 జులై 1 నాటికి 18-36 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం - ఓబీసీ, పీహెచ్, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు ఉంటాయి.


దరఖాస్తు రుసుము - RRB Group D Fee : 

జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. మహిళలు, ఈబీసీలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.


ఎంపిక ప్రక్రియ - RRB Group D Selection Process : 

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.


జీతభత్యాలు - RRB Group D Salary :

 గ్రూప్‌-డి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,000 వరకు జీతం ఇస్తారు. ఇతర భత్యాలు కూడా ఉంటాయి.


ఆర్‌ఆర్‌బీ రీజియన్లు :-

సికింద్రాబాద్‌, చెన్నై, భువనేశ్వర్‌, బెంగళూరు, అహ్మదాబాద్, అజ్‌మేర్, భోపాల్, బిలాస్‌పూర్, చండీగఢ్, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ


ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్ విడుదలైన తేదీ:  2024 డిసెంబర్‌ 28

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం:  2025 జనవరి 23

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:  2025 ఫిబ్రవరి 22


నోట్‌ : గ్రూప్‌-డి పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఎంపిక విధానం, సిలబస్‌ తదితర పూర్తి వివరాలను ఆర్‌ఆర్‌బీ త్వరలో విడుదల చేయనుంది.


Next Post Previous Post
error: Content is protected !!
×
SPONSORED AD
You can close in 5s...