RRB Jobs 2025:10వ తరగతి అర్హతతో రైల్వేలో 32438 ఉద్యోగాలు జీతం నెలకు 18000 ఇలా అప్లై చేయండి! - AP Job Alerts



RRB Group D Recruitment 2025 :

భారతీయ రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీ కోసం 32,438 పోస్టులతో పూర్తి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా ఐటిఐ విద్యార్హతలు ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 


మొత్తం పోస్టుల సంఖ్య :

మొత్తం 32,438 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హత : 

ఈ ఉద్యోగాలకు పదో తరగతి లేదా ఐటిఐ విద్యార్హత పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చు. 


కనీస వయస్సు : 

ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి. (01-01-2025 నాటికి)

గరిష్ట వయస్సు : 

36 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. (01-01-2025 నాటికి)


వయస్సులో సడలింపు : 

ప్రభుత్వ నిబంధనలో ప్రకారం ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.

జీతం: ప్రారంభంలో బేసిక్ పే 18,000/- తో పాటు ఇతర అలవెన్స్ లు ఇస్తారు.


ఫీజు :

- SC, ST , PwBD , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మరియు మహిళా అభ్యర్థులుకు ఫీజు 250/- (SC, ST , PwBD , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మరియు మహిళా అభ్యర్థులుకు వారు చెల్లించిన పూర్తి ఫీజు రిఫండ్ చేస్తారు)

- మిగతా అభ్యర్థులకు 500/- రూపాయలు. (400/- రిఫండ్ చేయడం జరుగుతుంది)

- పరీక్ష రాసిన అభ్యర్థులకు బ్యాంకు చార్జీలు మినహాయించి ఫీజు రిఫండ్ కూడా చేయడం జరుగుతుంది.


ఎంపిక విధానము : 

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.


పరీక్ష విధానం : 

- ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా వంద మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు. 

- 90 నిమిషాల సమయం ఉంటుంది. 

- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. 

- ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు మార్కులు తగ్గిస్తారు.


RRB గ్రూప్ D ఎంపిక ప్రక్రియ

RRB గ్రూప్ D రిక్రూట్‌మెంట్ 2025 కోసం ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది:

Phase 1 : కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT 1) : అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ పరీక్షలు.

Phase 2: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) : రన్నింగ్ మరియు వెయిట్ లిఫ్టింగ్ (CBT 1 క్వాలిఫైయర్‌లకు మాత్రమే) ద్వారా శారీరక దృఢత్వాన్ని అంచనా వేస్తుంది.

Phase 3: డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) & మెడికల్ ఎగ్జామినేషన్ : డాక్యుమెంట్‌లను వెరిఫై చేస్తుంది మరియు మెడికల్ ఫిట్‌నెస్‌ని నిర్ధారిస్తుంది


దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

23-01-2025 నుండి ఈ ఉద్యోగాలకు గతంలో అప్లై చేయనివారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

అప్లై చేయడానికి చివరి తేదీ : 

22-02-2025 తేది లోపు ఈ పోస్టులకు అర్హత ఉండే వారు అప్లై చేయాలీ.


1 Comments

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share