NHAI Recruitment 2025:
న్యూఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 60 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల సంఖ్య: 60
డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) పోస్టులు
పోస్టుల కేటాయింపు:
యూఆర్- 26 పోస్టులు,
ఓబీసీ(ఎన్‌సీఎల్)- 13 పోస్టులు,
ఎస్సీ- 09 పోస్టులు,
ఎస్టీ- 04 పోస్టులు,
ఈడబ్ల్యూఎస్- 08 పోస్టులు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (సివిల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
30 సంవత్సరాలు మించకూడదు.
ఓబీసీలకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: గేట్ స్కోరు (2024), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం: నెలకు రూ.56,100 - రూ.1,77,500.
సర్వీస్ బాండ్:
ఎంపికైన అభ్యర్థులందరూ ఉద్యోగంలో చేరే సమయంలో ఎన్‌హెచ్‌ఏఐలో చేరిన తేదీ నుంచి కనీసం 3 సంవత్సరాల పాటు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)లో పనిచేయుటకు రూ.5.00 లక్షల మొత్తానికి సర్వీస్ బాండ్ అందించాల్సి ఉంటుంది.
బాండ్ వ్యవధి ముగిసేలోపు అభ్యర్థులు జాబ్ రిజైన్ చేసిన సందర్భంలో లేదా ఎన్‌హెచ్‌ఏఐలో చేరిన మూడేళ్లలోపు వారి అనుచిత ప్రవర్తన కారణంగా వారి సేవను రద్దు చేసినట్లయితే, అటువంటి అభ్యర్థులు రూ.5.0 లక్షల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది
దరఖాస్తు చేయడం ఎలా..
➥ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి Google Chrome లేదా Mozilla Firefox లో యాక్సెస్ చేయవచ్చు.
➥ ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక వెబ్‌సైట్ www.nhai.gov.in ఓపెన్ చేయాలి.
➥ అభ్యర్థులు → రిక్రూట్‌మెంట్ → వేకెన్సీస్ → కరెంట్ → ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
➥ డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) → ఆన్‌లైన్ అప్లికేషన్ యొక్క ప్రకటనపై క్లిక్ చేయాలి.
➥ అప్లికేషన్ పూర్తి చేయడానికి స్క్రీన్ పై సూచనలను అనుసరించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.02.2025.