Anganwadi Jobs: అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల 116 అంగన్వాడీ ఖాళీలు - AP Job Alerts

AP Anganwadi Recruitment : అన్నమయ్య జిల్లాలో 116 అంగన్వాడీ ఖాళీలు

అన్నమయ్య జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 116 అంగన్వాడీ పోస్టుల భర్తీకి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది. మొత్తం 11 ప్రాజెక్టుల పరిధిలో కార్యకర్తల పోస్టులు 11, మినీ కార్యకర్త 12, సహాయకుల పోస్టులు 93 ప్రకారం ఖాళీగా ఉన్నాయి.


ఖాళీల వివరాలు:

అంగన్వాడీ వర్కర్/ మినీ అంగన్వాడీ వర్కర్/ అంగన్వాడీ హెల్పర్: 116 పోస్టులు

Anganwadi Worker - 11

Anganwadi Helper - 93

Mini Anganwadi Worker - 12


అర్హత:10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానికంగా నివాసిస్తున్న వివాహిత మహిళలు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.

వయస్సు: 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు అంగన్వాడీ వర్కర్ పోస్టులకు రూ.11500, మినీ అంగన్వాడీ వర్కర్కు రూ.7000, అంగన్వాడీ హెల్పరు రూ.7000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేదు.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి.

బయోడేటాతో పాటు విద్యార్హతలు, ఇతర సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించి, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి.

ముఖ్యమైన తేదీలు...

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 24-12-2024.

దరఖాస్తుకు చివరి తేదీ: 02-01-2025.

1 Comments

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share