BSF Recruitment 2024, Notification Out for 275 Constable Posts, Apply Online Telugu - AP Job Alerts

 

BSF Recruitment 2024: బీఎస్‌ఎఫ్‌లో 275 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు 

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), స్పోర్ట్స్ కోటాలో 275 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 


ఖాళీల వివరాల:-

కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నాన్-గెజిటెడ్ అండ్‌ నాన్ మినిస్టీరియల్ (స్పోర్ట్స్ కోటా): 275 పోస్టులు


క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ, ఈక్వెస్ట్రియన్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, ఐస్-స్కీయింగ్, జూడో, కరాటే, వాలీబాల్, వెయిట్‌ లిఫ్టింగ్‌, వాటర్‌ స్పోర్ట్స్, రెజ్లింగ్, షూటింగ్, టైక్వాండో, వుషు, ఫెన్సింగ్.


అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు నేషనల్‌/ ఇంటర్నేషనల్‌ ఈవెంట్స్‌లో సంబంధిత క్రీడాంశాల్లో పాల్గొని ఉండాలి లేదా విజయాలు సాధించి ఉండాలి.


వయోపరిమితి: 01 జనవరి 2025 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.


జీతం: 7వ పే స్కేల్ ప్రకారం: ₹21,700 – ₹69,100 నెలకు


ఎంపిక విధానం: అప్లికేషన్స్‌ షార్ట్‌లిస్టింగ్‌, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.


దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.147.20. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 


ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 01-12-2024.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-12-2024.



Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share