రైల్వేలో 7951 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే.. - AP Job Alerts

 


RRB JE Recruitment 2024  2024 :-  రైల్వేలో 7951 ఉద్యోగాలు..  పూర్తి వివరాలివే..

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజనీర్‌ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. అప్లికేషన్ ప్రాసెస్ జులై 30న ప్రారంభం అవుతుంది.

RRB JE Recruitment 2024 Overview
Organization Railway Recruitment Board
Post Name Junior Engineer, Supervisor
Total Post 7952 Posts
Application Date July 30, 2024 to August 29, 2024
Apply Mode Online
Selection Process Computer Based Exam
Official Website https://www.indianrail.gov.in/


మొత్తం పోస్టుల సంఖ్య -  7951

RRB JE Recruitment 2024 Vacancy Total : 7952 Posts
Post Name Total
Junior Engineer, Supervisor & more 7952 Posts


ఖాళీల వివరాలు :-

జూనియర్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్‌వైజర్ (రీసెర్చ్), మెటలర్జికల్ సూపర్‌వైజర్ (రీసెర్చ్) 

వయోపరిమితి :- దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 36 ఏళ్లలోపు ఉండాలి.


RRB JE Recruitment 2024 : Age limit
Post Name Age Limit
Junior Engineer, Supervisor & more 18 to 36 years



అర్హత:- సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్‌‌ విభాగాల్లో ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


జీతాల వివరాలు :- రైల్వేలో జూనియర్ ఇంజనీర్‌ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ. 35,400 లభిస్తుంది. జీతంతో పాటు అనేక రకాల అలవెన్సులు, సౌకర్యాలు అదనంగా లభిస్తాయి.

RRB JE Recruitment 2024 - Salary
Post Name Salary (per month)
Junior Engineer, Supervisor & more Rs.35,400 to Rs.44,900 per month


ఎగ్జామ్ ప్యాట్రన్ :- 

ఆర్‌ఆర్‌బీ సీబీటీ-1  :- ఎగ్జామ్ 100 మార్కులకు ఎంసీక్యూ మోడల్‌లో ఉంటుంది. మ్యాథమెటిక్స్ సెక్షన్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్- 25, జనరల్ అవేర్‌నెస్- 15, జనరల్ సైన్స్ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్క్ కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు .

ఆర్‌ఆర్‌బీ  సీబీటీ-2 :-   ఎగ్జామ్‌లో 150 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ నుంచి 15 ప్రశ్నలు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ-15, కంప్యూటర్ అప్లికేషన్- 10, ఎన్విరాన్‌మెంట్ అండ్ పొల్యూషన్- 10, టెక్నికల్ ఎబిలిటీ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు.


అప్లికేషన్ ఫీజు :-  జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ. 250 పేమెంట్ చేయాలి.


 సెలక్షన్ ప్రాసెస్  :- జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఉద్యోగులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు. ముందు సీబీటీ-1 ఎగ్జామ్, తర్వాత సీబీటీ-2 ఎగ్జామ్ ఉంటాయి. చివరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అభ్యర్థుల ఫైనల్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.


దరఖాస్తు విధానం:  ఆన్లైన్ ద్వారా.

 ఫీజు చెల్లింపు ప్రారంభతేది:  30.07.2024.

 ఫీజు చెల్లింపుకు చివరితేది :  29.08.2024.

దరఖాస్తు సవరణ తేదీలు : 30.08.2024 నుంచి 08.09.2024 వరకు


RRB JE Recruitment 2024 Important Dates
Online Registration starts from July 30, 2024.
Online Registration ends on August 29, 2024.
Date of Application Form Modification 30.08.2024 To 08.09.2024


Website : https://rrbsecunderabad.gov.in


Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share