Daily Telugu Current Affairs 22 July 2024 - APJOBALERTS

 


Daily Telugu Current Affairs 22 July 2024 - APJOBALERTS


తెలుగు మరియు ఇంగ్లీష్ 2024 లో తాజా రోజువారీ కరెంట్ అఫైర్స్‌ను ఈ వెబ్సైట్ - AP Job Alerts . in లో అందిస్తున్నాము. అన్నిAPPSC, TSPSC, SI, కానిస్టేబుల్, VRO, VRA, గ్రూప్స్, SSC, RRB , AP DSC , AP TET ,బ్యాంక్ పరీక్షలు మొదలైన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కరెంట్ అఫైర్స్‌ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.


 Telugu Current Affairs  22  July  2024 :-

1 . ఇటీవల, ఎవరు రచించిన 'పవర్ విత్ ఇన్: ది లీడర్‌షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ' పుస్తకం విడుదలైంది?

 Ans :- ఆర్ బాల సుబ్రహ్మణ్యం (R Bala Subrahmanyam)


2 . ఇటీవల 'మనోలో మార్క్వెజ్' ఏ దేశ ఫుట్‌బాల్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎన్నికయ్యారు?

 Ans :- భారత్ (India)


భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్‌గా మనోలో మార్క్వెజ్‌ను ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) శనివారం నియమించింది.


3 .CAG గ్రీష్ చంద్ర ముర్ము ఇటీవల అంతర్జాతీయ స్థానిక పరిపాలన ఆడిట్ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు?

 Ans :- గుజరాత్ (Gujarat)

కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్ చంద్ర గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆడిట్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ (ICAL)ని ప్రారంభించారు.


4 . ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయుధం 'బాగ్ నఖ్' ఇటీవల లండన్ నుండి ఎక్కడికి తీసుకువచ్చారు?

 Ans :-  ముంబై (Mumbai)

ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన యుద్ధకాల ఆయుధం 'వాఘ్ నఖ్' లండన్‌లోని విక్టోరియా & ఆల్బర్ట్ (V&A) మ్యూజియం నుండి ఇటీవల ముంబైకి తీసుకురాబడింది.


5 .ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాన్ని ప్రధాని మోదీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?

 Ans :- న్యూ ఢిల్లీ (New Delhi)

ఇటీవల న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు.


6 .ఇటీవల, విమానంలోని అన్ని భాగాలపై ప్రభుత్వం ఎంత శాతం ఏకరూప GSTని అమలు చేసింది?

 Ans :-  5%

సోమవారం నుంచి అన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ విడిభాగాలపై ఏకరీతిగా 5 శాతం ఐజీఎస్టీని అమలు చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ప్రకటించారు.


7 . ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించారు?

 Ans :-  తెలంగాణ (Telangana)


8 .ఇటీవల UPSC చైర్మన్ కు రాజీనామా చేసారు ఆయన పేరు ఏమిటి ?

 Ans :- మనోజ్ సోని (Manoj soni)

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోనీ తన పదవీ కాలం పూర్తి కాకుండానే తన పదవికి రాజీనామా చేశారు. సోనీ పదవీకాలం 2029 మేలో ముగియనుంది.


Next Post Previous Post
No Comment
Add Comment
comment url
Advertisement
Advertisement
✕ CLOSE
× CLOSE