Daily Telugu Current Affairs 20 July 2024 - APJOBALERTS

 


Daily Telugu Current Affairs 20 July 2024 - APJOBALERTS


తెలుగు మరియు ఇంగ్లీష్ 2024 లో తాజా రోజువారీ కరెంట్ అఫైర్స్‌ను ఈ వెబ్సైట్ - AP Job Alerts . in లో అందిస్తున్నాము. అన్నిAPPSC, TSPSC, SI, కానిస్టేబుల్, VRO, VRA, గ్రూప్స్, SSC, RRB , AP DSC , AP TET ,బ్యాంక్ పరీక్షలు మొదలైన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కరెంట్ అఫైర్స్‌ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.


 Telugu Current Affairs  20  July  2024 :-


1 . కేంద్ర మంత్రి బిఎల్ వర్మ ఇటీవల 'సామాజిక సాధికారత శిబిరాన్ని' ఎక్కడ ప్రారంభించారు?

 Ans :- ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh)

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలోని పోలీస్ లైన్ గ్రౌండ్‌లో 'సామాజిక సాధికారత శిబిరాన్ని' వర్మ ప్రారంభం చేసారు.


2 .ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం పామాయిల్ రంగంలో సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి?

 Ans :- మలేషియ( Malaysia)


3 .ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంట రుణాల మాఫీకి 06 వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది?

 Ans :- తెలంగాణ ( Telangana )

లక్ష రూపాయల వరకు పంట రుణాల మాఫీ మొదటి దశను ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు.


4 . విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల 'మైత్రి ఉద్యాన్'ని ఎక్కడ ప్రారంభించారు?

 Ans :-  మారిషస్ (Mauritius)


5 . జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల కొత్త జాతి డాగ్ ఫిష్ షార్క్ ఎక్కడ కనుగొనబడింది?

 Ans :- కేరళ (Kerala)

కేరళలోని అరేబియా సముద్ర తీరంలోని శక్తికులంగర ఫిషింగ్ హార్బర్ లో నీటిలో ది హిందూ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ZSI) శాస్త్రవేత్తలు ఇటీవల స్క్వాలస్ హిమ డాగ్ ఫిష్ షార్క్ అనే ఒక కొత్త జాతిని కనుగొన్నారు.


6 . ఇటీవల వినయ్ మోహన్ క్వాత్రా ఏ దేశానికి భారత రాయబారిగా నియమితులయ్యారు?

 Ans :-  అమెరికా (America)

అమెరిక చైనా సహా పలు దేశాల్లో పనిచేసిన వినయ్ మోహన్ క్వాత్రాను ఇటీవల అమెరికాలో భారత రాయబారిగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


7 .ఇటీవల భారత T201 జట్టుకు కెప్టెన్‌గా ఎవరు నియమితులయ్యారు?

 Ans :-  సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav)


8 .ఇటీవల, FICCI భారతదేశ GDP వృద్ధి రేటు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతంగా ఉంటుందని అంచనా వేసింది?

 Ans :- 7 %

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25కి స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు 7.0 శాతంగా అంచనా వేసింది.


9 . 'PM స్వానిధి యోజన' కింద ఇటీవల ఏ రాష్ట్రం అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా అవతరించింది?

 Ans :-  మధ్య ప్రదేశ్ (Madhya Pradesh)

ప్రధానమంత్రి స్వనిధి పథకంలో 'బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్' కేటగిరీ కింద మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.స్వానిధి పథకం కింద రూ.50,000 వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణం ఇస్తారు.


Next Post Previous Post
No Comment
Add Comment
comment url
Advertisement
Advertisement
✕ CLOSE
× CLOSE