TO Day News - నేటి వార్తలు (13.02.2024) - AP News Info

 



TO Day News - నేటి వార్తలు (13.02.2024)  :-


✅నేటి ప్రత్యేకత:

► ప్రపంచ రేడియో దినోత్సవం 

► జాతీయ మహిళా దినోత్సవం 


🌍 అంతర్జాతీయ వార్తలు - International news :-

► గూఢచర్య ఆరోపణలపై 2022 నుండి ఖతార్ జైలులో ఉన్న ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులను నిన్న అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది.


► పాకిస్తాన్ లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ - నవాజ్ (పి.ఎం.ఎల్- ఎన్) బిలావల్ బుట్టు జార్దారి నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) లు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి.


► దక్షిణ గాజాలోని రఫా నగరం పై దాడి చేసిన ఇజ్రాయిల్ సైన్యం హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇద్దరిని కాపాడగా, ఈ దాడిలో 67 మంది పాలస్తీనీయులు మృతి చెందారు.


► ప్రపంచంలోని వలస జాతులలో ప్రతి ఐదింటిలో ఒకటి అంతర్ధాన ముప్పును ఎదుర్కొంటుందని 44% జాతుల సంఖ్య తగ్గిపోతోందని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలియజేసింది.


► అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ లో ఉన్న లేక్ ఉడ్ చర్చిలో ఆదివారం నాడు ఓ మహిళ జరిపిన కాల్పులలో ఇద్దరు గాయాల పాలయ్యారు.


🈁 జాతీయ వార్తలు - National News :-


► జేఈఈ మెయిన్ పేపర్ 1 తుది కీ ని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్.టి.ఏ.) నిన్న విడుదల చేసింది.


► భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు రేపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో పర్యటనలో భాగంగా 14వ తేదీన ఖతార్ కు వెళ్లనున్నట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.


► జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలకు సంబంధించిన కేసులో నేడు తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సమన్లు జారీ చేసింది.


► బీహార్ లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఏర్పడిన జేడియు- ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిన్న శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గింది.


► రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రుల నియామకం రాజ్యాంగ విరుద్ధం కాదని ఈ విషయంలో దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు నిన్న కొట్టివేసింది.


► కేంద్ర ప్రభుత్వంతో నిన్న జరిపిన చర్చలు విఫలమవడంతో ముందుగానే నిర్ణయించినట్లు "ఢిల్లీ చలో" పేరుతో నేడు భారీ స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి.


► ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న"రోజ్ గార్ మేళా" లో భాగంగా లక్ష మందికి పైగా అభ్యర్థులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందించారు.


► రేషన్ దుకాణాలు వద్ద జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ ఎఫ్ ఎస్ ఎ) లోగో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోటోతో కూడిన బ్యానర్లు, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించబోమని కేరళ ప్రభుత్వం నిన్న స్పష్టం చేసింది.


►  2023 అక్టోబర్ నాటికి మార్కెట్ విలువ ఆధారంగా బర్గండి ప్రైవేట్, హురూన్ ఇండియా సంస్థలు సంయుక్తంగా రూపొందించిన నివేదికలో దేశంలో అత్యంత విలువైన 500 ప్రైవేటు కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ ఐ ఎల్) అగ్రస్థానంలో నిలిచింది.


🈴 రాష్ట్ర వార్తలు - State News :- 


► రాష్ట్రంలో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న విడుదల చేశారు.


► స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన సాధారణ బెయిల్ ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఈనెల 26 కు వాయిదా వేసింది.


► పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలియజేశారు. 


► రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిన్న నామినేషన్లు దాఖలు చేశారు.


⛳ క్రీడావార్తలు -  Sports News : -


► దోహాలో జరుగుతున్న ప్రపంచ అక్వాటిక్స్ ఛాంపియన్షిప్స్ లో 400 మీటర్స్ ఫ్రీ స్టైల్ రిలే లో చైనా స్విమ్మర్ పాన్ జాన్లే 46.80 సెకన్లలో 100 మీ. ఈది ప్రపంచ రికార్డు సృష్టించాడు.


► భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్ లో తొలిసారిగా టాప్ -100 లో ప్రవేశించి 98 వ ర్యాంకు సాధించాడు.

error: Content is protected !!