PNB Recruitment 2025 :
పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) దిల్లీ ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మార్చి 24వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు - ఖాళీలు
1. క్రెడిట్ ఆఫీసర్: 250
2. ఇండస్ట్రీ ఆఫీసర్: 75
3. మేనేజర్(ఐటీ): 05
4. సీనియర్ మేనేజర్(ఐటీ): 05
5. మేనేజర్ డేటా సైంటిస్ట్: 03
6. సీనియర్ మేనేజర్(డేటా సైంటిస్ట్): 02
7. మేనేజర్ సైబర్ సెక్యూరిటీ: 05
8. సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ: 05
మొత్తం ఖాళీల సంఖ్య: 350
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, సీఎ, ఐసీడబ్ల్యూ, ఎంబీఏ, పీజీడిఎం, ఎంసీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
21 నుంచి 38 ఏళ్లు నిండి ఉండాలి.
జీతం:
నెలకు క్రెడిట్ ఆఫీసర్, ఇండస్ట్రీ ఆఫీసర్‌కు రూ.48,480 - రూ.85,920, మేనేజర్ (ఐటీ), మేనేజర్ డేటా సైంటిస్ట్, మేనేజర్ సైబర్ సెక్యూరిటీకు రూ.64,820 - 93,960, సీనియర్ మేనేజర్(ఐటీ), సీనియర్ మేనేజర్(డేటా సైంటిస్ట్), సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీకు రూ.85,920 - 1,05,280.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.50.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
పరీక్ష కేంద్రాలు:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, దిల్లీ, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపుర్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ్ బెంగాల్.
ముఖ్య తేదీలు..
దరఖాస్తు ప్రారంభ తేదీ: 03-03-2025.
దరఖాస్తు చివరి తేదీ: 24-03-2025.
రాత పరీక్ష తేదీలు: మార్చి/మే 2025