India Post GDS Recruitment 2025 :
భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ (India Post Office) షెడ్యూల్-I జనవరి 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ GDS నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు :
21, 143 ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 1215 మరి తెలంగాణలో 519 ఉద్యోగాలు ఉన్నాయి.
1. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)
పోస్టుల సంఖ్య: సర్కిల్ వారీగా అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
విద్యార్హత: గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 18 నుండి 40 సంవత్సరాలు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది).
ఉద్యోగ బాధ్యతలు:
బ్రాంచ్ పోస్టాఫీసులో రోజువారీ పోస్టల్ కార్యకలాపాలను నిర్వహించడం.
ఇండియా పోస్ట్, IPPB సేవల మార్కెటింగ్ మరియు ప్రచారం.
మెయిల్ రవాణా, డెలివరీని నిర్వహించడం.
2. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)
పోస్టుల సంఖ్య: సర్కిల్ వారీగా అధికారిక నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
విద్యార్హత: గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 18 నుండి 40 సంవత్సరాలు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది).
ఉద్యోగ బాధ్యతలు:
వివిధ పోస్టల్, ఆర్థిక కార్యకలాపాల్లో BPMకి సహాయం చేయడం.
మెయిల్ మరియు IPPB లావాదేవీల డోర్ స్టెప్ డెలివరీ.
స్టాంపులు, స్టేషనరీ మరియు ఇతర పోస్టల్ సేవలను సేల్ చేయండి.
పోస్టల్ ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రచారం చేయడం.
3. డాక్ సేవక్
పోస్టుల సంఖ్య: సర్కిల్ వారీగా అధికారిక వెబ్‌సైటల్ చెక్ చేసుకోవచ్చు.
విద్యార్హత: గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 10వ తరగతి ఉత్తీర్ణత ఉంటుంది.
వయోపరిమితి: 18 నుండి 40 సంవత్సరాలు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది).
ఉద్యోగ బాధ్యతలు:
మెయిల్ మరియు పార్శిల్స్ డెలివరీ చేయడం.
IPPB డిపాజిట్లు, విత్‌డ్రా, ఇతర లావాదేవీలను నిర్వహించడం.
పోస్టాఫీసు కార్యకలాపాల్లో సహాయం చేయడం.
కేటాయించిన పోస్టాఫీసు పరిధిలో నివసించాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఫిబ్రవరి 10, 2025
దరఖాస్తులకు చివరితేది: మార్చి 3, 3035
దరఖాస్తు సవరణ తేదీలు : మార్చి 6 నుంచి 8 వరకు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు https://indiapostgdsonline.cept.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు సమర్పణకు ముందు వన్-టైమ్ రిజిస్ట్రేషన్ అవసరం.
అవసరమైన సర్టిఫికెట్లను స్కాన్ చేసిన కాపీలను మాత్రమే అప్‌లోడ్ చేయాలి.
06.03.2025 నుండి 08.03.2025 వరకు తప్పులు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా ఖచ్చితమైన వివరాలను నిర్ధారించుకోవాలి.