NTPC Recruitment 2025, Apply Online For 475 Engineering Executive Trainees Posts - AP Job Alerts



NTPC Recruitment 2025:

న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) గేట్-2023 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 475 పోస్టులను భర్తీ చేయనున్నారు. 


ఖాళీల వివరాలు:

 ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ: 475 పోస్టులు


విభాగాల వారిగా ఖాళీలు:

1. ఎలక్ట్రానిక్స్‌- 135

2. మెకానికల్‌- 180

3. ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌- 85

4. సివిల్‌- 50

5. మైనింగ్‌- 25


అర్హత: ఇంజినీరింగ్‌ లేదా టెక్నాలజీ/ ఏఎంఐఈలో 65 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఫుల్‌ టైం బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు 55 శాతం)తో పాటు గేట్‌ 2024 స్కోర్‌ తప్పనిసరి ఉండాలి.


జీత భత్యాలు: నెలకు రూ.40,000- రూ.1,40,000 ఉంటుంది.


వయోపరిమితి: దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.


ఎంపిక ప్రక్రియ: గేట్‌ 2024 స్కోర్‌, షార్ట్‌లిస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.


దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


దరఖాస్తులు ప్రారంభ తేదీ: జనవరి 30, 2025

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 13, 2025


NTPC EET రిక్రూట్‌మెంట్ 2025 కి ఎలా దరఖాస్తు చేయాలి?

ఆసక్తిగల అభ్యర్థులు ఈ దశలను అనుసరించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు:


- అధికారిక NTPC వెబ్‌సైట్ careers.ntpc.co.in ని సందర్శించండి .

- EET 2025 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి.

- వ్యక్తిగత వివరాలు మరియు GATE 2024 ఆధారాలను ఉపయోగించి నమోదు చేసుకోండి.

- విద్యా వివరాలతో దరఖాస్తు ఫారమ్ నింపండి మరియు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

- దరఖాస్తు రుసుము (వర్తిస్తే) చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి.

- భవిష్యత్ సూచన కోసం నిర్ధారణ రసీదును డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.


Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share