Union Bank of India Recruitment 2025: Apply Online for 2691 Apprenticeship Vacancies Details telugu - AP Job Alerts



Union Bank of India Recruitment 2025:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Union Bank of India) దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2691 పోస్టులను భర్తీ చేయనున్నారు.


ఖాళీల సంఖ్య: 2691

మొత్తం 2691 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్ లో 222 పోస్టులు, తెలంగాణలో 123 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూషన్ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 

- 01.02.2025  నాటికి 20 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 

- నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. 

- ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, 

- ఓబీసీ(ఎన్‌సీఎల్) అబ్యర్థులకు 03 సంవత్సరాలు, 

- పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. 


శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది.


దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ/ఎస్టీ/మాహిళా అభ్యర్థులకు రూ.600, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, స్థానిక భాషపై పట్టు ఆధారంగా ఎంపిక చేస్తారు.


పరీక్ష విధానం: 

- ఆన్‌లైన్ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది.  

- మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 

- జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్- 25 మార్కులు, 

- జనరల్ ఇంగ్లీష్- 25 మార్కులు, 

- క్వాంటిటేటివ్ & రీజనింగ్ ఆప్టిట్యూడ్- 25 మార్కులు, 

- కంప్యూటర్ నాలెడ్జ్-  25 మార్కులు ఉంటాయి. 

- సమయం: 60 నిమిషాలు.


స్టైపెండ్: నెలకు రూ.15,000.


ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.02.2025.

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 05.03.2025.



ఎలా దరఖాస్తు చేయాలి ?

యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025కి దరఖాస్తు చేసుకునే విధానం:

1 . అధికారిక వెబ్‌సైట్ www.unionbankofindia.co.in సందర్శించండి.

2 . అప్రెంటిస్ పోర్టల్ (NATS) లో రిజిస్టర్ అవ్వండి.

3 . NATS పోర్టల్‌లో లాగిన్ చేసి “Union Bank of India” ప్రకటనను ఎంచుకోండి.

4 . అవసరమైన వివరాలు నమోదు చేసి దరఖాస్తు సమర్పించండి.

5 . ఆన్‌లైన్ ఫీజు చెల్లించండి.

6 . భవిష్యత్తు కోసం దరఖాస్తు ప్రింట్ తీసుకోండి

Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share