APCOB Recruitment 2025 for 251 Post, Eligibility, Fee, Last Date, Apply Online Telugu - AP Job Alerts

 


APCOB Notification 2025 :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB).. భారీ ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 251 పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, విజయవాడ, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో డిస్ట్రిక్‌ కో- ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకుల్లో (DCCB) ఖాళీగా ఉన్న స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్స్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 


మొత్తం ఖాళీల సంఖ్య: 251

అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు : 50

స్టాఫ్‌ అసిస్టెంట్/ క్లర్క్‌ పోస్టులు : 201


ఇతర ముఖ్యమైన సమాచారం :

అర్హత: పోస్టులను అనుసరించి గుర్తింపు పొందిన యునివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణతతో పాటు తెలుగు/ ఇంగ్లిష్‌ భాషల్లో (చదవటం/ రాయడం) ప్రావీణ్యం, కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి.


వయోపరిమితి: 31.10.2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: పోస్టులను బట్టి నెలకు రూ.26,080- రూ.57,860 వరకు (అన్నీ అలవెన్సులు కలుపుకుని) ఉంటుంది.


జీతం:

స్టాఫ్ అసిస్టెంట్/క్లార్క్ - 26,080 నుండి 57,860 + ఇంక్రిమెంట్లు

అసిస్టెంట్ మేనేజర్ - 17,900 నుండి 47,920 + ఇంక్రిమెంట్లు


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.


దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులు రూ.700; ఎస్సీ/ ఎస్టీ/ పీసీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 22, 2025


దరఖాస్తు ప్రక్రియ:

1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి “APPLY ONLINE” క్లిక్ చేయండి.

2. మీ పేరు, కాంటాక్ట్, ఇమెయిల్ IDతో రిజిస్టర్ చేయండి.

3. ఫోటో, సంతకం, thumb impression అప్‌లోడ్ చేయండి.

4. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించండి (SC/ST/PC/EXS రూ.500, జనరల్/BC రూ.700).

5. అన్నీ సరిగా చూసి దరఖాస్తు సమర్పించండి.


Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share