10వ తరగతి అర్హతతో - ITBPలో 819 కానిస్టేబుల్ పోస్టులు - అప్లై చేసుకోండిలా! - AP Job Alerts
ITBP Constable Recruitment 2024 : కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) గ్రూప్-సి విభాగంలోని 819 కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు :
కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) : 819 పోస్టులు
పురుషులు - 697 పోస్టులు
మహిళలు - 122 పోస్టులు
Vacancy Type | Total |
---|---|
Male | 697 Posts |
Female | 122 Posts |
Total | 819 Posts |
కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు
యూఆర్ - 458
ఓబీసీ - 162
ఈడబ్ల్యూఎస్ - 81
ఎస్టీ - 70
ఎస్సీ - 48
విద్యార్హతలు :
మెట్రిక్యులేషన్/ 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి.
దీనితో పాటు ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ కోర్సులో క్వాలిఫై అయ్యుండాలి.
శారీరక ప్రమాణాలు :
పురుషుల ఎత్తు 165 సెం.మీ., మహిళల ఎత్తు 155 సెం.మీ. ఉండాలి.
పురుషుల ఛాతీ 75 సెం.మీ. నుంచి 80 సెం.మీ. మధ్య ఉండాలి.
వయోపరిమితి :-
అభ్యర్థుల వయస్సు 2024 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
Post Name | Age Limit |
---|---|
Minimum Age | 18 Years |
Maximum Age | 25 Years |
దరఖాస్తు రుసుము :-
జనరల్, ఓబీసీ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.100 చెల్లించాలి.
మహిళలు, ఎక్స్-సర్వీస్మెన్, ఎస్టీ, ఎస్సీలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.
Category | Fee |
---|---|
General Category | Rs. 100/- |
SC/ST Candidates | Exempted |
Ex-Servicemen | Exempted |
జీతభత్యాలు : ఐటీబీపీ కానిస్టేబుల్కు నెలకు రూ.21,700 - రూ.69,100 జీతం ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ : ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అర్హులైన అభ్యర్థులను కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
Category | Gender | Height | Chest |
For All Except Some | Male | 165 cm | 75-80 cm |
Female | 155 cm | x | |
For ST | Male | 160 cm | 75-80 cm |
Female | 148 cm | x |
Male | Female |
1.6 Kms Race – To be completed within 7.30 minutes. Long Jump – 11 Feet (03 Chances) High Jump – 3½ Feet (03 Chances) | 800 Mtr Race – To be completed within 4.45 minutes. Long Jump – 09 Feet (03 Chances) High Jump – 3 Feet (03 Chances) |
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ముందుగా ITBP అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్లి అప్లికేషన్ లింక్పై క్లిక్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 సెప్టెంబర్ 2
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 అక్టోబర్ 1
Application Start Date | 02/09/2024 |
Application Last Date | 01/10/2024 |
Exam Date | Notified Soon |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url