Punjab National Bank PNB SO Recruitment 2024 post 1025 - AP Job Alerts

 



PNB Recruitment 2024 : పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 1025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు 


న్యూఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం.. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .


మొత్తం పోస్టులు - 1025

ఆఫీసర్-క్రెడిట్ (జేఎంజీ స్కేల్-I): 1000 పోస్టులు

మేనేజర్-ఫారెక్స్ (ఎంఎంజీ స్కేల్-II): 15 పోస్టులు

మేనేజర్-సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-II): 05 పోస్టులు

సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-III): 05 పోస్టులు


ముఖ్య సమాచారం :

విద్యార్హత : ఖాళీలను అనుసరించి బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయో పరిమితి: 01.01.2024 నాటికి ఆఫీసర్ పోస్టులకు 21-28 ఏళ్లు; మేనేజర్‌ పోస్టులకు 25-35 ఏళ్లు; సీనియర్ మేనేజర్ పోస్టులకు 27-38 ఏళ్ల మధ్య ఉండాలి.


జీత భత్యాలు: నెలకు ఆఫీసర్‌కు రూ.36,000-రూ.63,840.. మేనేజర్‌కు రూ.48,170-రూ.69,810.. సీనియర్ మేనేజర్‌కు రూ.63,840-రూ.78,230గా ఉంటుంది.


ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


పరీక్ష విధానం: రాత పరీక్షకు సంబంధించి పార్ట్‌-1లో రీజనింగ్‌ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (50 ప్రశ్నలు- 50 మార్కులు).. పార్ట్‌-2లో ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ (50 ప్రశ్నలు- 100 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష కాల వ్యవధి 2 గంటలు.


దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.590, మిగతా అభ్యర్థులకు రూ.1180గా నిర్ణయించారు.


తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, వైజాగ్, హైదరాబాద్.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం: ఫిబ్రవరి 7, 2024

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2024

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: మార్చి/ ఏప్రిల్ 2024 ఉంటుంది.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.pnbindia.in/


Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share