TO Day History Telugu April 12 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 12 - AP JOB ALERTS

TO Day History Telugu April 12 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 12 - AP JOB ALERTS

 



💢   TO Day History Telugu April 12 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ - 12


🟣 సంఘటనలు :-


● 1961 : రష్యా అంతరిక్ష శాస్త్రవేత్త యూరీ గగారిన్ Vostok 3KA-2 (Vostok 1) ఉపగ్రహంలో ప్రయాణించి మొట్టమొదట అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మానవునిగా నిలిచాడు.


● 1981 : ప్రపంఛపు మొట్టమొదట స్పేస్ షటిల్ (అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రాగల వ్యొమనౌక) "కొలంబియా"ను అమెరికా విజయవంతంగా ప్రయొగించింది.


● 2009 : థాయిలాండ్ లోని పట్టాయ నగరంలో ఆసియాన్ దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైనది.


● 2010 : లూధియానా, పంజాబ్, లో గల గురునానక్ స్టేడియంలో భారతీయ కబడ్డీ జట్తు పాకిస్థాన్ జట్టును 58-24 తేడాతో ఓడించి ప్రప్రథమంగా ప్రపంచ కప్ కబడ్డీ పోటీలను గెలుచుకుంది.



🟢 జననాలు :-


● 599 BC: వర్థమాన మహావీరుడు, జైన మతం స్థాపకుడు. 24 వ తీర్థంకరుడు. (మ. 527 BC)


● 1854 : ఎస్.పి.నరసింహులు నాయుడు తమిళనాడుకుచెందిన భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు, సమాజసేవకుడు, ప్రచురణకర్త.


● 1879: కోపల్లె హనుమంతరావు, జాతీయ విద్యకై విశేష కృషిన వారు. (మ.1922)


● 1917: వినూమన్కడ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (మ.1978)


● 1925: అట్లూరి పిచ్చేశ్వర రావు, కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్త. (మ.1966)


● 1936: అమరపు సత్యనారాయణ, నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (మ.2011)


● 1938: జ్వాలాముఖి, రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. (మ.2008)


● 1991: ముక్కాని సాంసన్, సింగీతం గ్రామనివాసి,


 🔴 మరణాలు :- 


●  1940: భోగరాజు నారాయణమూర్తి, నవలా రచయిత, నాటక కర్త. (జ.1891)


●  1945: ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్డ్, అమెరికా 32 వ అధ్యక్షుడు . (జ. 1882)


●  1962: మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశపు ఇంజనీరు. (జ.1861)


●  1989: ఎక్కిరాల భరద్వాజ, ఆధ్యాత్మిక గురువు, రచయిత. (జ.1938)


●  1992: మాకినేని బసవపున్నయ్య, మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. (జ.1914)


●  2006: రాజ్‌కుమార్, భారత చలనచిత్ర నటుడు, గాయకుడు. (జ.1929)


🟤 జాతీయ దినాలు :-

● అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం (ప్రపంచ రోదసీ దినోత్సవం).




Next Post Previous Post
No Comment
Add Comment
comment url
Sponsored • Job Alerts