Navy Agniveer SSR 1/2023 Notification Released for 1400 Vacancies, Apply Online - APJOBALERTS

 


Navy Agniveer SSR 1/2023 Notification Released for 1400 Vacancies, Apply Online - APJOBALERTS

Indian Navy Agniveer Recruitment: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్‌ స్కీమ్‌లో భాగంగా భారత నౌకాదళంలో అగ్నివీర్ ఖాళీల నియామకానికి ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1400 ఖాళీలను భర్తీ చేయనున్నారు.


Organization Name Indian Navy
Posts Name 1400 Agniveer (SSR) - 01/2023 Batch Posts
Total Vacancies 1400 Posts
Job Duration 4 Years
Starting Date To Apply 08.12.2022
Last Date To Apply 17.12.2022
Apply Mode online  Mode
Official Website Click Here
Join Telegram Group Click Here


మొత్తం ఖాళీల సంఖ్య: 1400 పోస్టులు (పురుషులు- 1,120, మహిళలు- 280)


అర్హత : మ్యాథ్స్, ఫిజిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా కెమిస్ట్రీ / బయాలజీ / కంప్యూటర్ సైన్స్‌లో ఏదో ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.


వయస్సు : అభ్యర్థి 01.05.2002 – 31.10.2005 మధ్యలో జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.


కనిష్ఠ ఎత్తు ప్రమాణాలు : పురుషులు 157 సెం.మీ., స్త్రీలు 152 సెం.మీ. ఉండాలి.


ఎంపిక ప్రక్రియ : షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష (సీబీఈ), రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష (పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.


శిక్షణ : అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో వచ్చే ఏడాది మే నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.


జీత భత్యాలు : ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.35500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది.


కంప్యూటర్ ఆధారిత పరీక్ష : ప్రశ్నపత్రం హిందీ / ఇంగ్లిష్ భాషల్లో మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 100 మార్కులను కలిగి ఉంటుంది. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్… నాలుగు విభాగాల్లో ఇంటర్మీడియట్‌ స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగటివ్ మార్కింగ్ అమలులో ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.


దరఖాస్తు ఫీజు : రూ.550.


దరఖాస్తు విధానం : అభ్యర్థులు  నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో  ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: డిసెంబర్ 08, 2022


ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: డిసెంబర్ 17, 2022


Official Notification Click Here (small-bt)
Apply Online Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here

Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share