BHEL Trainee Recruitment 2025 for 400 Vacancies Details Telugu - AP Job Alerts
BHEL Recruitment 2025:
భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BHEL) ఇంజినీర్ ట్రైనీ, సూపర్‌వైజర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 28 దరఖాస్తులకు చివరితేది.
భర్తీ చేస్తున్న పోస్టులు :
ఇంజనీర్ ట్రైనీ మరియు సూపర్వైజర్ ట్రైనీ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
- నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
- భర్తీ చేస్తున్న పోస్టుల్లో ఇంజనీర్ ట్రైనీ 150 పోస్టులు ,
- సూపర్వైజర్ ట్రైనీ 250 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఇంజినీర్ ట్రైనీ పోస్టులు- 150
మెకానికల్ - 70
ఎలక్ట్రికల్ - 26
సివిల్ - 12
ఎలక్ట్రానిక్స్ - 10
కెమికల్ - 03
మెటలర్జీ - 04
సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు- 250
మెకానికల్ - 140
ఎలక్ట్రికల్ - 55
సివిల్ - 35
ఎలక్ట్రానిక్స్ - 20
కెమికల్ - 00
మెటలర్జీ - 00
అర్హత :
- ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలకు ఉద్యోగాలకు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా 5 సంవత్సరాల మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు 65% మార్కులతో ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. (SC, ST అభ్యర్థులకు 60% మార్కులు రావాలి)
అప్లికేషన్ విధానం :
ఈ పోస్టులకు అర్హులైన వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష , డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి వివిధ దశల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
బేసిక్ పే:
ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.50,000; సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.32,000.
దరఖాస్తు ఫీజు:
- యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1072;
- ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్ సర్వీస్‌మెన్ వారికి రూ.472.
అప్లికేషన్ ప్రారంభ తేది :
ఆన్లైన్ లో 01-02-2025 తేది నుండి అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ చివరి తేదీ :
ఆన్లైన్ లో 28-02-2025 తేదిలోపు అప్లై చేయాలి.
