AIIMS CRE Recruitment 2025 :
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భారీ సంఖ్యలో గ్రూప్ సీ, గ్రూప్ డీ పోస్టులు (మొత్తం 4576) భర్తీ చేయనున్నారు. ఇందులో అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్, ల్యాబ్ అటెండర్ లా మొత్తం 66 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 4576
విద్యార్హత:
10వ తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. (SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది)
దరఖాస్తు విధానం :
ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి నెలకు రూ.19,900 నుంచి రూ.92,300 వరకు జీతం ఉంటుంది. తదుపరి TA, DA, HRA వంటి అలవెన్సులు కూడా లభిస్తాయి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు.. రూ.3,000.. SC, ST, EWS అభ్యర్థులకు.. రూ.2,400 ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
ఉద్యోగ ఎంపిక విధానం:
రాత పరీక్ష 2025 ఫిబ్రవరి 26 నుంచి 28 తేదీల్లో ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్‌లో అర్హత సాధించిన తర్వాత చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
రాత పరీక్ష విధానం:
- AIIMS CRE 2025 ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. సాధారణ ఆప్టిట్యూడ్, డొమైన్ పరిజ్ఞానం, సంబంధిత నైపుణ్యాలను అంచనా వేయడానికి CBT ఉంటుంది. 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
- పరీక్షను పూర్తి చేయడానికి అభ్యర్థులకు 90 నిమిషాల సమయం ఉంటుంది.
- ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
- కేటగిరీల వారీగా క్వాలిఫైయింగ్ మార్కులు వేరుగా ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: జనవరి 7, 2025
ఆన్‌లైన్ అప్లికేషన్ ముగింపు తేది: జనవరి 31, 2025
ఆన్‌లైన్ అప్లికేషన్ కరెక్షన్ తేదీలు : ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు
రాత పరీక్ష తేదీలు: 2025 ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు.
