IOCL Jobs 2024: ఇండియన్ ఆయిల్ లో 240 ఖాళీలు... పరీక్ష లేకుండానే శిక్షణ, ఉద్యోగం! - AP Job Alerts

IOCL Recruitment 2024 :-

 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌ ల్లో ఖాళీగా ఉన్న 240 అప్రెంటీస్‌(Apprentice) పోస్టులను భర్తీ చేయనున్నారు.


పోస్టు పేరు, ఖాళీలు:

▪ మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ - 20

 సివిల్ ఇంజ‌నీరింగ్ - 20

 ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్ - 20

 ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజ‌నీరింగ్ - 20

 ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ ఇంజ‌నీరింగ్‌ - 20

 ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్ ఇంజ‌నీరింగ్ - 20

 నాన్- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ - 120


విభాగాలు:

 మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్, ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్.


అర్హతలు:

 సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ (బీఏ/బీఎస్సీ/బీకామ్/బీబీఏ/బీసీఏ/బీబీఎం)


 ఉత్తీర్ణత.

 వయోపరిమితి: 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.


శిక్షణ వివరాలు:

 శిక్షణ వ్యవధి: 1 సంవత్సరం.

 శిక్షణ కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, కర్ణాటక.


స్టైపెండ్: 

 డిప్లొమా (టెక్నీషియన్) అభ్యర్థులకు నెలకు రూ.10,500;

  గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ.11,500.


ఎంపిక ప్రక్రియ:

 మెరిట్ లిస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక జరుగుతుంది.


ముఖ్యమైన తేదీలు:

 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 04-11-2024

 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29-11-2024

 ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 06-12-2024

 ధ్రువపత్రాల పరిశీలన: 18-12-2024 నుండి 20-12-2024


Website :-  https://iocl.com/apprenticeships


IOCL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఎలా నమోదు చేసుకోవాలి?


1 . NATS పోర్టల్‌కు వెళ్ళండి: nats.education.gov.in.

2 . స్టూడెంట్ సెక్షన్ ఎంచుకుని, స్టూడెంట్ లాగిన్ పై క్లిక్ చేయండి.

3 . కొత్త అభ్యర్థులు, "స్టూడెంట్ రిజిస్టర్" పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారం పూర్తి చేసి మీ ఎన్రోల్మెంట్ నెంబర్ పొందండి.

4 . ముందే రిజిస్టర్ చేసిన అభ్యర్థులు: మీ ఇమెయిల్ ఐడి మరియు పాస్‌వర్డ్ తో లాగిన్ అవ్వండి.

5 . “Apply against advertised vacancies” లో "Indian Oil Corporation Limited" కోసం వెతకండి.

6 . “Apply” పై క్లిక్ చేయండి; మీ అప్లికేషన్ స్టేటస్ “Applied” గా కనిపిస్తుంది.

7 . అవసరమైన డాక్యుమెంట్లు, provisional సర్టిఫికెట్లు లేదా మార్క్ షీట్లను, శాతంతో సహా అప్‌లోడ్ చేయండి.


1 Comments

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share