-->

apsrtc recruitment 2024 : విజయవాడ జోన్‌లో 311 ఖాళీలు - apjobalerts


APSRTC Apprentice  2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC), విజయవాడ జోన్ పరిధిలో పలు ట్రేడుల్లో అప్రెంటిస్ (Apprenticeship) శిక్షణకు సంబంధించి 311 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 


ఖాళీల వివరాలు:

▪ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ ఖాళీలు : 311


జిల్లాల వారీగా ఖాళీలు: 

▪ కృష్ణా- 41, 

▪ ఎన్టీఆర్- 99, 

▪ గుంటూరు- 45, 

▪ బాపట్ల- 26, 

▪ పల్నాడు- 45, 

▪ ఏలూరు- 24, 

▪ పశ్చిమగోదావరి- 31 ఖాళీలు ఉన్నాయి.


ట్రేడులు: 

▪ డీజిల్ మెకానిక్, 

▪ మోటార్ మెకానిక్, 

▪ ఎలక్ట్రీషియన్, 

▪ వెల్డర్, 

▪ పెయింటర్, 

▪ ఫిట్టర్, 

▪ మెషినిస్ట్, 

▪ డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్ టేడ్రుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.


అర్హత: దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల అధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: నవంబర్‌ 6, 2024

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 20, 2024

ధ్రువపత్రాల పరిశీలించే స్థలం: ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, చెరువు సెంటర్‌, విద్యాధరపురం, విజయవాడలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది.