ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా (పాఠశాల విద్యాశా ఖ) ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో.. 2024-25 విద్యా సంవత్సరా నికి సంబంధించి ఏడాది కాలానికి బోధన, బోధనే తర సిబ్బంది పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 604.
పోస్టుల వివరాలు:
ప్రిన్సిపల్ - 10,
పోస్ట్ గ్రాడ్యు యేట్ టీచర్(పీజీటీ) - 165.
సబ్జెక్టులు: ఇంగ్లిష్, సివిక్స్, కామర్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఒకేషనల్.
కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ (సీఆర్టీ)-163.
సబ్జెక్టులు: తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫి జికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్.
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ)-04,
పార్ట్ టైమ్ టీచర్(పీటీటీ)-165,
వార్డెన్-53,
ఆకౌంటెంట్-44.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టు లో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ, యూజీ డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడ బ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికు లకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు ప్రిన్సిపల్ కు రూ.34,139, పీజీటికి రూ.26,759, పీ ఈ టి కి .26,759, సి ఆర్టీ కి రూ.26,759, అకౌంటెంట్ కు రూ.18,500. వార్డెన్ కు రూ.18,500, పార్టెమ్ ఇన్స్ట్రక్టర్ కు 5.18,500.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, సర్వీస్ వెయిటేజీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.10.2024.
website : https://apkgbv.apcfss.in