RRB Technician Vacancy 2024 Increased to 14298 Posts details telugu - AP Job Alerts

 




RRB Technician  Recruitment 2024 : 

రైల్వే శాఖ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. వివిధ రైల్వే జోన్లలో 9,144 టెక్నీషియన్‌ పోస్టులకు ఈ ఏడాది గత మార్చిలో ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టును భారీగా పెంచుతున్నట్లు రైల్వే శాఖ అధికారిక ప్రకటన వెలువరించింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అవసరాల దృష్ట్యా 40 కేటగిరీల్లో మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నాయి.


RRB Technician Recruitment 2024 Overview
Organization93 Railway Recruitment Board (RRB)
Post Name Technician (Grade 1 Signal and Grade 3)
Total Post 14298 [Revised] Posts
Category Railway Jobs
RRB Technician Exam Date 2024 October/November 2024
Apply Mode Offline
Selection Process
  • CBT Exam
  • Document Verification
  • Medical Examination
  • Mode of Exam Computer Based Test
    Salary Grade 1 Signal- Rs. 29,200 Grade 3- Rs. 19,900
    Official Website https://indianrailways.gov.in/, https://www.rrbapply.gov.in/


    మొత్తం పోస్టుల సంఖ్య : 14,298 పోస్టులు

    • టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: 5,154 పోస్టులు
    • టెక్నీషియన్ గ్రేడ్-III సిగ్నల్: 9,144 పోస్టులు


    అర్హత : అభ్యర్థులు టెన్త్ తో పాటు సంబంధింత ట్రేడుల్లో ఐటీఐ పాసై ఉండాలి.


    ఎంపిక విధానం : ఈ పోస్టులకు సంబంధించి కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


    జీతం : నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 ప్రారంభ వేతనం ఉంటుంది.

     

    రాతపరీక్ష విధానం:  మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు అదనంగా 30 నిమిషాల సమయం కేటాయిస్తారు. 


    టెక్నీషియన్ గ్రేడ్-I  :- పోస్టులకు జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగం నుంచి 10 ప్రశ్నలకు 10 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ విభాగం నుంచి 15 ప్రశ్నలకు 15 మార్కులు, బేసిక్స్‌ ఆఫ్‌ కంప్యూటర్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు, మ్యాథమెటిక్స్‌ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు, బేసిక్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం నుంచి 35 ప్రశ్నలకు 35 మార్కుల చొప్పున ప్రశ్నలు వస్తాయి. 


    టెక్నీషియన్ గ్రేడ్-III :- పోస్టులకు మ్యాథమెటిక్స్‌ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు, జనరల్‌ సైన్స్‌ విభాగం నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగం నుంచి 10 ప్రశ్నలకు 10 మార్కులు అంశాలపై ప్రశ్నలు వస్తాయి. గంటన్నర వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.


    రాత పరీక్ష తేదీలు : అక్టోబర్‌/ నవంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.



    Share this post with friends

    See previous post See next post
    No one has commented on this post yet
    Click here to comment

    Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

    comment url
    X
    Don't Try to copy, just share