APPSC Forest Range Officer Recruitment 2024, 37 Vacancies, Eligibility, Apply Telugu - AP Job Alerts

 



APPSC Forest Range Officer Recruitment 2024 :-


ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి. అర్హత కలిగిన అభ్యర్థులు మే 5 నాటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ అటవీ శాఖలో 37 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.


  ఏపీ పారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రిక్రూట్‌మెంట్‌ 2024

► ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ

► మే 5 దరఖాస్తులకు చివరితేది


APPSC Forest Range Officer Recruitment 2024 :  ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (Forest Range Officer) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లు మధ్య ఉండాలి. జీతం రూ.48,000 నుంచి రూ.1,37,220 ఉంటుంది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, నడక, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు మే 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


 మొత్తం పోస్టులు - 37 Posts


అర్హత:  సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అగ్రికల్చర్‌, బోట‌నీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ / కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ (అగ్రికల్చర్‌/ కెమికల్ / సివిల్ / కంప్యూటర్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ /మెకానికల్) పర్యావరణ శాస్త్రం, ఫారెస్ట్రీ, జాగ్రఫీ, హార్టీకల్చర్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌, వెటర్నరీ సైన్స్, జువాలజీ విభాగాల్లో తత్సమాన విద్యార్హతతో పాటు నోటిఫికేషన్‌లో చూపిన విధంగా శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.


వయోపరిమితి : 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు : ప్రతి అప్లికెంట్‌ రూ. 250 అప్లికేష‌న్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు.. ప‌రీక్ష ఫీజు రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ, బీసీ/ఎక్స్ సర్విస్‌మెన్ తదితరులకు ప‌రీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు ఉంటుంది.


జీతం: రూ. 48,000 నుంచి రూ. 1,37,220గా నిర్ణయించారు.


దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


పరీక్షా కేంద్రాలు : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్‌ కడప, అనంతపురం, కర్నూలు.


జోన్ల వారీగా పోస్టులు(FRO Posts)

జోన్ -I : 08 ఖాళీలు

జోన్ -II : 11 ఖాళీలు

జోన్ -III : 10 ఖాళీలు

జోన్ -IV : 08 ఖాళీలు


How To Apply APPSC FRO : ఎలా దరఖాస్తు చేయాలి?


STEP - I :  అభ్యర్థి ముందుగా ఏపీపీఎస్సీ(APPSC) వెబ్‌సైట్‌ లో https://applications-psc.ap.gov.in/LoginNew.aspx రిజిస్టర్డ్ OTPR నంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఒకవేళ అభ్యర్థి తొలిసారి ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోవాలి.


STEP-II : అభ్యర్థి తన ఓటీపీఆర్, పాస్ వర్డ్ తో ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత "Online Application" పై క్లిక్ చేయాలి. ఫారెస్ట్ రిజర్వ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తును పూర్తి చేయండి.


STEP-III : అభ్యర్థి పూర్తి వివరాలు నమోదు చేసుకుని, లోకల్/నాన్ లోకల్ స్టేటస్, వైట్ కార్డ్ వివరాలు పూరించాలి. ఆ తర్వాత అభ్యర్థి వివరాలు సరిచూసుకుని సబ్మిట్ పై క్లిక్ చేయాలి.


STEP-IV : అభ్యర్థులు అప్లికేషన్, పరీక్ష ఫీజు ఆన్ లైన్ మోడ్ లో చెల్లించాలి.


STEP-V : ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్‌లో సవరణలు ఏపీపీఎస్సీ అవకాశం కల్పిస్తుంది.


ఫీజు వివరాలు


అర్హత కలిగిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో అప్లికేషన్ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాల్సిన అవసరంలేదు.


పరీక్ష విధానం ఇలా?

ఎఫ్ఆర్వో ప్రిలిమ్స్ (AP FRO Prelims)పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్-ఎ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, పార్ట్-బిలో జనరల్ ఫారెస్ట్రీ అంశాలు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.


మెయిన్ పరీక్షను(AP FRO Mains) మొత్తం 600 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్స్ లో మొత్తం నాలుగు పేపర్లను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. వీటిల్లో ఒకటి క్వాలిఫైయింగ్ పేపర్ (జనరల్ ఇంగ్లిష్, జనరల్ తెలుగు) ఉంటుంది. మెయిన్స్ లో నెగెటివ్ మార్కులు(1/3) ఉంటాయి. మెయిన్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఓసీలకు 40, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 మార్కులు కనీస అర్హతగా నిర్ణయించారు.


ముఖ్యమైన తేదీలు


ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం- ఏప్రిల్ 15

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది- మే 5

రాతపరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు





 


Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share