SSC Stenographer 2023 Notification : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. తాజాగా 1207 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ పాసైన వాళ్లు అర్హులు.
SSC Recruitment 2023 – Apply Online for 1207 Stenographer Posts Telugu - APJOBALERTS
న్యూదిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో/ విభాగాల్లో/ సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి (గ్రూప్ సి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
Post Details
Organization | Staff Selection Commission (SSC) |
Post Name | Stenographer Post |
Vacancies | 1207 Posts |
Application Mode | Online |
Last Date to Apply Online | 23 August 2023 |
Job Location | All Over India |
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య: 1,207.
పోస్టులు :
1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి (గ్రూప్-బి, నాన్-గెజిటెడ్)
2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి (గ్రూప్-సి)
Post Name | No of Posts |
---|---|
Stenographer Grade C | 93 |
Stenographer Grade D | 1114 |
Total | 1,207 |
డిపార్ట్‌మెంట్ పేరు : డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్‌మెంట్ అండ్ రెజువెనేషన్, ఇండియన్ మెటియోరాలాజికల్ డిపార్ట్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, తదితరాలు.
అర్హత : ఇంటర్మీడియట్ / తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
వయోపరిమితి : 01-08-2023 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి పోస్టులకు 18-30 ఏళ్లు, గ్రేడ్- డి పోస్టులకు 18-27 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీల వారీగా వయో సడలింపు కల్పించారు.
Post Name | Age Limit (Years) |
---|---|
Stenographer Grade C | 18-30 |
Stenographer Grade D | 18-27 |
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ అంశాల్లో ప్రశ్నలుంటాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు : గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు రుసుము : రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఆగస్ట్ 03, 2023
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఆగస్ట్ 23, 2023
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 23.08.2023.
దరఖాస్తు సవరణ తేదీలు : 24.08.2023 నుంచి 25.08.2023 వరకు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్ : అక్టోబర్, 2023.