India Post GDS Online Recruitment 2023 Apply for 30041 Posts, Check Qualification Full Details Telugu - Ap Job Alerts

 


India Post GDS Recruitment 2023 :-

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 30,041 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన (షెడ్యూల్‌-2, జులై 2023) వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ABPM), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 23 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Post Details

Organization Indian Postal Department
Post Name GDS/ BPM/ ABPM
Vacancies 30041 Posts
Application Mode Online
Last Date to Apply Online 23 August 2023
Job Location All Over India


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

పోస్టులు : గ్రామీణ డాక్ సేవక్స్- బ్రాంచ్ పోస్టు మాస్టర్ / అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ / డాక్ సేవక్

మొత్తం ఖాళీలు : 30,041 పోస్టులు

సర్కిల్ వారీగా ఖాళీలు:

1. ఆంధ్రప్రదేశ్– 1058

2. అసోం- 855

3. బిహార్- 2300

4. ఛత్తీస్‌గఢ్- 721

5. దిల్లీ – 22

6. గుజరాత్- 1850

7. హరియాణా- 215

8. హిమాచల్‌ ప్రదేశ్- 418

9. జమ్మూ అండ్‌ కశ్మీర్- 300

10. ఝార్ఖండ్- 530

11. కర్ణాటక- 530

12. కేరళ- 1508

13. మధ్యప్రదేశ్- 1565

14. మహారాష్ట్ర- 3154

15. నార్త్ ఈస్టర్న్- 500

16. ఒడిషా- 1279

17. పంజాబ్- 336

18. రాజస్థాన్- 2031

19. తమిళనాడు- 2994

20. ఉత్తర్‌ ప్రదేశ్- 3084

21. ఉత్తరాఖండ్- 519

22. పశ్చిమ్‌ బెంగాల్- 2127

23. తెలంగాణ– 961


అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి.


వయసు : 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు , దివ్యాంగులకు 10 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

  • OBC Candidates: 03 Years
  • SC/ST Candidates: 05 Years
  • PwD (General) Candidates: 10 Years
  • PwD (OBC) Candidates: 13 Years
  • PwD (SC/ST) Candidates: 15 Years

జీత భత్యాలు : నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 – రూ.29,380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470 వేతనం ఉంటుంది.

Gramin Dak Sevak (Branch Postmaster)                          Rs.12000-29380/-

Gramin Dak Sevak (Assistant Branch Postmaster) Rs.10000-24470/-


ఎంపిక విధానం : అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం నియామకాలు చేపడతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్‌డ్‌/ అన్‌ రిజర్వ్‌డ్‌ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదానికి ఆప్షన్‌ 1 తర్వాత దానికి ఆప్షన్‌ 2, ఆప్షన్‌ 3 ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్‌ కేటాయిస్తారు. ఎంపికైన వారికి సమాచారం ఎస్‌ఎంఎస్‌ / ఈమెయిల్‌/ పోస్టు ద్వారా అందుతుంది.


దరఖాస్తు విధానం : దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాలి.


దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.


బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (BPM) : ఈ పోస్టుకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్‌ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్‌ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్‌ వ్యవహారాలూ చక్కబెట్టాలి. బృంద నాయకుడిగా సంబంధిత బ్రాంచ్‌ను నడిపించాలి. పోస్టల్‌ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.


అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌(ABPM) : ఈ ఉద్యోగంలో చేరినవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్‌ పోస్టు పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు చక్కబెట్టాలి. బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ నిర్దేశించిన పనులు పూర్తి చేయాలి. వివిధ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి.


డాక్‌ సేవక్‌ : ఈ విధుల్లో చేరినవారు ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం సూచించిన పనులు పూర్తిచేయాలి. రైల్వే మెయిల్‌ సర్వీస్‌, పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు విధులు చూసుకోవాలి. పోస్టల్‌ పథకాలు ప్రచారం చేయాలి.


ముఖ్యమైన తేదీలు:


ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: ఆగస్ట్ 03, 2023.


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్ట్ 23, 2023.


దరఖాస్తు సవరణలకు అవకాశం: 24.08.2023 నుంచి 26.08.2023 వరకు.



Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share