SSC CGL Recruitment 2023 Apply Online | 7500 Group B, Group C Vacancies Telugu - Apjobalerts
SSC CGL Recruitment 2023 :-
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (CGL) పరీక్ష-2023 కు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:
1. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
2. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
3. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
4. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఐబీ)
5. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఎవోఆర్)
6. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఎంవోఈఏ)
7. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎఫ్‌హెచ్‌క్యూ)
8. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఈ అండ్ ఐటీ)
9. అసిస్టెంట్
10. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
11. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్
12. ఇన్‌స్పెక్టర్ (సీజీఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్)
13. ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)
14. ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)
15. అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
16. సబ్ ఇన్‌స్పెక్టర్
17. ఇన్‌స్పెక్టర్ (పోస్ట్ డిపార్ట్‌మెంట్)
18. అసిస్టెంట్ / సూపరింటెండెంట్
19. అసిస్టెంట్
20. అసిస్టెంట్ (ఎన్‌సీఎల్‌ఏటీ)
21. రిసెర్చ్ అసిస్టెంట్
22. డివిజనల్ అకౌంటెంట్
23. సబ్ ఇన్‌స్పెక్టర్
24. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
25. ఆడిటర్ (సీ అండ్ ఏజీ)
26. ఆడిటర్
27. ఆడిటర్ (సీజీడీఏ)
28. అకౌంటెంట్
29. అకౌంటెంట్ / జూనియర్ అకౌంటెంట్
30. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ / అప్పర్ డివిజన్ క్లర్క్
31. ట్యాక్స్ అసిస్టెంట్
32. సబ్-ఇన్‌స్పెక్టర్
33. పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్
ఖాళీల సంఖ్య: 7,500
విద్యార్హతలు : పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, సీఏ / సీఎంఏ / సీఎస్ / పీజీ డిగ్రీ / ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి : 01.08.2023 నాటికి ఖాళీలను అనుసరించి 18-27 ఏళ్లు, 20-30 ఏళ్లు, 18-30 ఏళ్లు, 18-32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మూడేళ్ల పాటు వయో సడలింపు కల్పించారు. వీరితో పాటు దివ్యాంగులకు ప్రత్యేకంగా వయో సడలింపు ఇచ్చారు.
వేతనం : ఆయా పోస్టులను బట్టి నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100/-
ఎంపిక విధానం : టైర్-1, టైర్-2 ఎగ్జామినేషన్, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్ / మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో రూ.100 ను ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.)
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు : చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్ 04, 2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: మే 03, 2023
ఆఫ్‌లైన్ చలానా జనరేషన్‌కు చివరితేది: 04.05.2023.
ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 09.10.2022.
చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 05.05.2023.
దరఖాస్తుల సవరణ తేదీలు: 07.05.2023 నుంచి 08.05.2023 వరకు.
టైర్-1 పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): జులై, 2023.
టైర్-2 పరీక్ష తేదీ: ప్రకటించాల్సి ఉంది.