CRPF : 9212 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. 10వ తరగతి పాసైన వాళ్లు అప్లయ్‌ చేసుకోవచ్చు

CRPF Constable Recruitment 2023: Registration Begins for 9212 Vacancies, Check Eligibility, Registration Dates - Ap job alerts

CRPF Constable Recruitment 2023 : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (CRPF Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 9212 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.


❃ ఖాళీ వివరాలు :  సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మొత్తం 9,212 ఖాళీ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అధికారిక ప్రకటన ప్రకారం.. 

పురుషుల కోసం మొత్తం ఖాళీల సంఖ్య 9,105, మహిళలకు 107 పోస్టులున్నాయి.


❃ పురుషుల పోస్టులు : మోటార్ మెకానిక్, డ్రైవర్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్రాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ మన్, బార్బర్, సఫాయి కర్మచారి తదితర పోస్టులున్నాయి.


❃ మహిళా పోస్టులు : బగ్లర్, కుక్, వాటర్ క్యాషియర్, వాషర్ ఉమెన్, హెయిర్ డ్రస్సర్, సఫాయి కర్మచారి, బ్రాస్ బ్యాండ్ తదితర పోస్టులన్నాయి.


❃ విద్యార్హతలు : పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టులను అనుసరించి ఏదైనా బోర్డు/యూనివర్సిటీ నుంచి టెన్త్, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు అప్లయ్‌ చేసుకోవచ్చు. హెవీ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఇంకా పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.


❃ వేతనం : ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం ఉంటుంది.


 CBT ( కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ) : మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో హిందీ/ఇంగ్లిష్ భాష కు 25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కు మరో 25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్ నెస్ కు మరో 25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథ్స్ కు 25 మార్కులు ఉంటాయి.


 వేతన స్కేలు : రూ.21,700 నుంచి రూ.69,100 ఉంటుంది.


❃ దరఖాస్తు ఫీజు : జనరల్‌ (పురుష) అభ్యర్థులకైతే రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష ఫీజు లేదు.


❃ దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


❃ తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే :


ఆంధ్రప్రదేశ్‌ : అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గగుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపూర్‌, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.


తెలంగాణ : ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌,ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్‌, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్‌, వరంగల్‌ (అర్బన్‌) నగరాల్లో పరీక్ష ఉంటుంది.


❃ పరీక్ష విధానం : 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. 2గంటల పాటు ఈ పరీక్ష ఉంటుుంది. జనరల్‌ ఇంటెలిజెన్స్‌/రీజనింగ్‌ నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌/ జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీకి 25 ప్రశ్నలకు 25 మార్కుల చొప్పున ఉంటాయి.


❃ దరఖాస్తులు ప్రారంభం : మార్చి 27, 2023

❃ దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్ 25, 2023

❃ అడ్మిట్ కార్డ్ జారీ : జూన్ 20-25

❃ CRPF కానిస్టేబుల్ పరీక్ష : జులై 1 నుంచి 13

❃ పూర్తి వివరాలకు వెబ్ సైట్ : https://crpf.gov.in/


Share this post with friends

See previous post See next post
1 John commented on it
  • Anonymous
    Anonymous 15 April 2023 at 03:22

    Please sir call me I am c.sagar

Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share