AP BC Welfare Class 5 Admissions 2023 Notification Apply Online Telugu
ఏపీ బీసీ గురుకులాల్లో అయిదోతరగతి ప్రవేశాలు
విజయవాడ-కానూరులోని మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఎంజే పీఏ పీబీసీడబ్ల్యూఆర్ ఈఐఎస్) - రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 103 గురుకుల పాఠశాలల్లో అయిదోతరగతి ప్రవేశాలకు నోటిఫికే షన్ విడుదల చేసింది. విద్యార్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. విద్యార్థుల స్థానికత ఆధారంగా సంబంధిత జిల్లాకు చెందిన గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్స్ ఇస్తారు. బాలురు, బాలిక లకు విడివిడిగా పాఠశాలలు ఉన్నాయి. ప్రత్యేక కేటగిరీ కింద అనాథ పిల్లలకు, మత్స్యకారుల పిల్లలకు ప్రవేశాలు కల్పిస్తారు.
గురుకులాల ప్రత్యేకతలు
🔸 స్టేట్ సిలబస్ ప్రకారం డిజిటల్ తరగతులతో ఆంగ్ల మాధ్య మంలో బోధన ఉంటుంది.
🔸 ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తారు. నాలుగు జతల యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, సాక్స్, రెండు దుప్పట్లు ఇస్తారు. పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, ప్లేట్, గ్లాస్, సమీ కృత పౌష్టికాహారం అందిస్తారు. క్రీడలలో శిక్షణ ఇస్తారు.
🔸 ఇక్కడ గ్రంధాలయాలు, ప్రయోగశాలలు ఉంటాయి.
🔸 అయిదోతరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఇంటర్ వరకూ ఇక్కడే చదువుకొనే అవకాశం ఉంది.
🔸 కాస్మొటిక్ ఖర్చుల కింద అయిదు, ఆరు తరగతులు చదివే బాలురకు నెలకు రూ.125; ఏడు నుంచి ఇంటర్ వరకు చదివేవా రికి నెలకు రూ.150లు ఇస్తారు. సెలూన్ ఖర్చుల నిమిత్తం నెలకు రూ.30 ఇస్తారు.
🔸 అయిదు నుంచి ఏడో తరగతి వరకు చదివే బాలిక లకు నెలకు రూ.130; ఎనిమిది నుంచి ఆపై చదివే బాలికలకు నెలకు రూ.250లు చెల్లిస్తారు.
అర్హత వివరాలు
🔸 గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరంలో మూడోతరగతి, 2022-23 సంవత్సరంలో నాలుగోతర గతి చదివి ఉండాలి.
🔸 ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు 2012 సెప్టెంబరు 1 నుంచి 2014 ఆగస్టు 31 మధ్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2010 సెప్టెంబరు 1 నుంచి 2014 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి.
🔸 కుటుంబ వార్షికాదాయం రూ.1,00,000లు మించకూడదు.
ప్రవేశ పరీక్ష వివరాలు
🔸 దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. తెలుగు నుంచి 10, ఇంగ్లీష్ నుంచి 10, లెక్కల నుంచి 15, పరిసరాల విజ్ఞానం నుంచి 15 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ నాలుగో తరగతి స్థాయిలోనే ఉంటాయి.
🔸విద్యార్థులు సమాధానాలను ఓఎం. ఆర్ పత్రం మీద గుర్తించాలి.
🔸పరీక్ష సమయం రెండు గంటలు.
🔸 ప్రశ్న పత్రాన్ని ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో ఇస్తారు.
🔸 మొత్తం మార్కులు 50.
Official Notification
దరఖాస్తు ఫీజు : రూ.100
ప్రవేశ పరీక్ష తేదీ : ఏప్రిల్ 16
వెబ్సైట్ : mjpapbcwreis.apcfss.in
చివరి తేదీ : ఏప్రిల్ 4
Importent Links
Official Notification | |
Apply Online | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |