BEL జాబ్స్ 2025 | ప్రాజెక్ట్ ఇంజినీర్ నోటిఫికేషన్ | ₹55,000 జీతం | చివరి తేదీ నవంబర్ 20
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. తాత్కాలిక ప్రాతిపదికన కింది ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు వివరాలు
ప్రాజెక్ట్ ఇంజినీర్: 52
విభాగాల వారీగా ఖాళీలు:
ఎలక్ట్రానిక్స్: 40
కంప్యూటర్ సైన్స్: 08
మెకానికల్: 04
అర్హత: ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు మొదటి ఏడాది రూ.40,000; రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాది రూ.50,000; నాలుగో ఏడాది రూ.55,000.
వయోపరిమితి: 01.11.2025 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు చివరి తేదీ: 20.11.2025.
ఇంటర్వ్యూ తేదీ: 24.11.2025.
వేదిక: బెల్, సైట్-4 ఇండస్ట్రియల్ ఏరియా, సహిబాబాద్, ఉత్తర్‌ప్రదేశ్.
